న్యూఢిల్లీ: శ్రీలంకలో ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకూ జరిగిన రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన భారత ఓపెనర్ రోహిత్ శర్మపై విమర్శల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్‌పై సోషల్ మీడియాలో జోక్‌లు పేలుతున్నాయి. ప్రధానంగా బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్‌లో ఎ -ప్లస్ గ్రేడ్‌ను దక్కించుకున్న రోహిత్.. జీతం పెరిగిన ఉద్యోగస్తుడు పని చేసిన మాదిరిగా అతని ఆట తీరు ఉందని ఒక అభిమాని ట్రోల్ చేయగా, మిగతా ఆటగాళ్లకు అవకాశం ఇద్దామనే ఉద్దేశంతోనే తొందరగా పెవిలియన్ చేరుతున్నాడని మరొక అభిమాని విమర్శించారు. 2018లో 15 ఇన్నింగ్స్‌ల్లో 40 పరుగుల మార్కును రోహిత్ రెండు సార్లు మాత్రమే దాటాడంటూ మరో అభిమాని అతని ఆట తీరును ప్రశ్నించాడు.
ఇటీవల రోహిత్ శర్మ బి గ్రేడ్ నుంచి రెండు స్థానాలు ఎగబాకి ఎ ప్లస్ గ్రేడ్ ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కొత్త కాంట్రాక్ట్ ప్రకారం అతను ఏడాదికి బీసీసీఐ నుంచి ఏడు కోట్లు అందుకోనున్నాడు. ఇదిలా ఉంచితే, శ్రీలంకలో ట్రై సిరీస్‌లో లంకేయులతో తొలి మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన రోహిత్.. బంగ్లాదేశ్ రెండో మ్యాచ్‌లో 17 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో రోహిత్‌ను టార్గెట్ చేస్తూ అటు ట్విట్టర్‌లోనూ, ఇటు ఫేస్‌బుక్‌లోనూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment