టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు సారథి విరాట్ కోహ్లి స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపాడు. ఈరోజు 33వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న అతడికి దేశ, విదేశ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్బంగా తన సహచర బ్యాట్స్‌మన్, వైస్‌కెప్టెన్ రోహిత్‌కు ట్విటర్ వేదికగా కోహ్లి బర్త్‌డే విషెస్ తెలిపాడు. ‘హ్యాపీ బర్త్‌డే రోహిత్. నీకు మంచి ఆరోగ్యం, సంతోషాన్ని అందించాలని, అదేవిధంగా నువ్వు మరెన్నో సొగసైన భారీ ఇన్నింగ్స్‌లు ఆడేలా ఆశీర్వదించాలని భగవంతుడిని కోరుకుంటున్నా. సురక్షితంగా ఆరోగ్యంగా ఉండండి’అంటూ కోహ్లి ట్వీట్ చేశాడు.
‘నా ఓపెనింగ్ పార్ట్‌నర్ రోహిత్ శర్మకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు షూటింగ్ స్టార్ వలే క్లీన్‌గా బంతిని మైదానం నుంచి బయటకు కొట్టడం కొనసాగించాలని ఆశిస్తున్నాము’అంటూ రోహిత్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతూ శిఖర్ ధావన్ ట్వీట్ చేశాడు. ఇక వీరిద్దరితో పాటు టీమిండియా ఆటగాళ్లు అజింక్యా రహానే, పుజారా, గంభీర్, తదితర ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక లాక్‌డౌన్ కారణంగా ఐపీఎల్ నిరవధిక వాయిదా పడటంతో రోహిత్ తన బర్త్‌డే వేడుకలను ఈసారి ఇంట్లోనే భార్య-కూతురితో జరుపుకుంటున్నాడు.
2007లో భారత జట్టులో అరంగేట్రం చేసిన రోహిత్ శర్మకు ఆదిలో తన స్థానంపై భరోసా ఉండేది కాదు. ఆడప దడపా అవకాశాలతో అలా నెట్టికొచ్చిన రోహిత్.. 2013 నుంచి జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా ఎదిగిపోయాడు. ఆ ఏడాది భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. తన ఆట తీరును మెరుగుపరుచుకుంటూ హిట్ మ్యాన్‌గా మారిపోయాడు. తన ఆటను విమర్శించిన వారికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పి వారితోనే ప్రశంసలు అందుకున్నాడు. అతని కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను సాధించిన రోహిత్.. ప్రస్తుతం టీమిండియా కీలక ఆటగాడు. వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్ ఘనత రోహిత్ దక్కించుకున్నాడు.
చదవండి:
హిట్‌మ్యాన్‌కు స్పెషల్ డే..!
'మాకు కోహ్లి అంకుల్ సెల్ఫీ కావాలి'
Comments
Please login to add a commentAdd a comment