చెన్నై: ధోని లాంటి ఆటగాడు లేకపోవడం ఏ జట్టుకైనా లోటేనని హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అన్నాడు. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్ 3–0తో సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 181 పరుగులు చేయగా, లక్ష్యాన్ని చివరి బంతికి భారత్ ఛేదించింది. ఓపెనర్ శిఖర్ ధవన్ (92), రిషబ్ పంత్ (53) ఆకట్టుకున్నారు. మ్యాచ్ అనంతరం తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ వివిధ అంశాలను పంచుకున్నాడు.
విండీస్‌తో వన్డే సిరీస్, అలాగే మొదటి రెండు టీ20ల్లోనూ విఫలమైన ఓపెనర్ శిఖర్ ధవన్ కీలకమైన ఆసీస్ పర్యటన నేపథ్యంలో ఫామ్‌లోకి రావడం శుభపరిణామ మన్నాడు. వన్డే సిరీస్‌లో బాగానే ఆడినప్పటికీ భారీ స్కోర్లు సాధించడంలో ధవన్ విఫలమ య్యాడని, అయితే చివరి టీ20లో మ్యాచ్‌ను గెలిపించే ఇన్నింగ్స్‌తో ఫామ్ అందిపుచ్చు కోవడం జట్టు అవసరాలకు ఎంతో ఉపయోగక రమని పేర్కొన్నాడు. అలాగే రిషబ్ పంత్, కృనాల్ పాండ్యపైనా రోహిత్ ప్రశంసలు కురి పించాడు. ధవనతో కలసి పంత్ మంచి భాగ స్వామ్యం ఏర్పరచాడని మెచ్చుకున్న రోహిత్.. కృనాల్ ధైర్యవంతుడైన ఆటగాడని, అతనికి జట్టులో సుదీర్ఘకాలం కొనసాగే సత్తా ఉందని చెప్పుకొచ్చాడు.
ఈ సిరీస్‌లో భారత్ ఫీల్డింగ్ మెరుగైనట్లు గుర్తించామని, అలాగే కొన్ని అత్యు త్తమ, చెత్త ప్రదర్శనలూ ఉన్నాయని వెల్లడిం చాడు. ధోని గైర్హాజరీపై సమాధానమిస్తూ.. నిదహాస్ ట్రోఫీలోనూ ధోని లేని విషయాన్ని గుర్తుచేసిన రోహిత్, అతని లాంటి ఆటగాడు లేకపోవడం ఏ జట్టుకైనా లోటేనని చెప్పాడు. ముఖ్యంగా యువ క్రికెటర్లు ధోని విలువైన సలహాలు, సూచనలకు దూరమయ్యారని వివరించాడు. ఆస్ట్రేలియాతో టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో రోహిత్‌కు చోటు దక్కడంపై సమాధానమిస్తూ దానిపై తాను పెద్దగా ఆలోచించడడం లేదని వెల్లడించాడు. కాగా, ఆస్ట్రేలియాలో భారత పర్యటన ఈ నెల 21 మూడు టీ20ల సిరీస్‌తో ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment