తొలి టెస్టులోనే సెంచరీ చేసిన రోహిత్
కోల్కతా: పొట్టి ఫార్మాట్లో సత్తా చాటిన టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ టెస్టుల్లోనూ అదరగొడుతున్నాడు. తొలి టెస్టులోనే సెంచరీ సాధించి తన రాకను ఘనంగా చాటుకున్నాడు. వెస్టిండీస్తో ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న మొదటి టెస్టులో రోహిత్ శర్మ శతకం బాదాడు. 194 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్తో తొలి టెస్టు సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన 14వ భారత ఆటగాడిగా నిలిచాడు.
83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను రోహిత్ తన విలువైన ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు. సంయమనంతో ఆడాడు. మంచి బంతులను గౌరవిస్తూ చెత్త బాల్స్ను చితక్కొట్టాడు. అశ్విన్ సహకారంతో జట్టుకు ఆధిక్యం సంపాదించిపెట్టాడు. అటు అశ్విన్ అర్థ సెంచరీతో రోహిత్కు అండగా నిలిచాడు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది. దీంతో విండీస్పై టీమిండియాకు 120 పరుగుల ఆధిక్యం లభించింది. రోహిత్ 127, అశ్విన్ 92 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.