debut Century
-
అరంగేట్రంలోనే రికార్డుల మోత మోగించిన జైశ్వాల్
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రెండోరోజు ఆట ముగిసేసరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. చిచ్చరపిడుగు యశస్వి జైశ్వాల్ అరంగేట్రం టెస్టులోనే అదరగొడుతూ అజేయ సెంచరీతో మెరవగా.. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా శతకంతో అదరగొట్టాడు. ప్రస్తుతం జైశ్వాల్ (350 బంతుల్లో 143 పరుగులు నాటౌట్), విరాట్ కోహ్లి(96 బంతుల్లో 36 పరుగులు నాటౌట్) క్రీజులో ఉన్నారు. అంతకముందు రోహిత్ శర్మ(221 బంతుల్లో 103 పరుగులు) చేసి ఔటయ్యాడు. ఆటకు ఇంకా మూడు రోజులు సమయం ఉండడం.. రహానే, జడేజా, ఇషాన్ కిషన్‌లు బ్యాటింగ్‌కు రావాల్సి ఉండడంతో టీమిండియా భారీ స్కోరు చేసే అవకాశముంది. ఇక అరంగేట్రం టెస్టులోనే సెంచరీతో అదరగొట్టిన యశస్వి జైశ్వాల్ రికార్డుల మోత మోగించాడు. వాటి విశేషాలు ఒకసారి పరిశీలిద్దాం. ► టీమిండియా తరపున డెబ్యూ టెస్టులో సెంచరీ బాదిన 17వ ఆటగాడిగా.. మూడో ఓపెనర్‌గా నిలిచాడు. ఇంతకముందు శిఖర్ ధావన్(2016లో), పృథ్వీ షా(2018లో) ఈ ఘనత సాధించారు. విదేశాల్లో అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాదిన తొలి భారత ఓపెనర్‌గానూ జైశ్వాల్ చరిత్రకెక్కాడు. ► ఇక విదేశాల్లో అరంగేట్రం టెస్టులో సెంచరీ బాదిన ఐదో భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఇంతకముందు అబ్బాస్ అలీ 1959లో ఇంగ్లండ్ గడ్డపై, 1976లో సురిందర్ అమర్నాథ్ న్యూజిలాండ్‌పై ఆక్లాండ్ వేదికగా, 1992లో ప్రవీణ్ ఆమ్రే సౌతాఫ్రికాపై డర్బన్ వేదికగా, 1996లో సౌరవ్ గంగూలీ లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌పై, 2001లో సౌతాఫ్రికాపై వీరేంద్ర సెహ్వాగ్ ఈ ఘనత సాధించారు. ► అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాదిన నాలుగో యంగెస్ట్ భారత క్రికెటర్‌గా జైశ్వాల్(21 ఏళ్ల 196 రోజులు) నిలిచాడు. ఈ జాబితాలో పృథ్వీ షా, అబ్బాస్ అలీ బేగ్, గుండప్ప విశ్వనాథ్‌లు ఉన్నారు. ► ఇక 91 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ గడ్డపై టీమిండియా తరపున అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా జైశ్వాల్ రికార్డులకెక్కాడు. ► రీసెంట్గా చూసుకుంటే జైశ్వాల్ కంటే ముందు శ్రేయాస్ అయ్యర్ 2021లో న్యూజిలాండ్‌పై అరంగేట్రం టెస్టులో సెంచరీ బాదిన క్రికెటర్‌గా నిలిచాడు. यशस्वी भवः 💯 . .#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/59Uq9ik1If — FanCode (@FanCode) July 13, 2023 చదవండి: Ind vs WI: అశ్విన్ అరుదైన ఘనత.. మూడో భారత బౌలర్‌గా చరిత్ర -
డెబ్యూ శతకం.. టీమిండియాపైనే బాదాలా?
ఆస్ట్రేలియా బ్యాటర్ కామెరాన్ గ్రీన్ టెస్టుల్లో తొలి శతకం సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో గ్రీన్ ఈ ఘనత అందుకున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై యథేచ్చగా బ్యాట్ ఝులిపించిన గ్రీన్ 143 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో శతకం మార్క్ సాధించాడు. కాగా గ్రీన్‌కు టెస్టుల్లో ఇదే తొలి శతకం. టీమిండియా గడ్డపై టెస్టుల్లో డెబ్యూ శతకం అందుకున్న అరుదైన ఆసీస్ క్రికెటర్ల జాబితాలో చేరిపోయాడు. అంతేకాదు ఉస్మాన్ ఖవాజాతో కలిసి గ్రీన్ ఐదో వికెట్‌కు 208 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆసీస్ తరపున టీమిండియా గడ్డపై టెస్టుల్లో ఇది రెండో అత్యుత్తమ పార్ట్నర్షిప్ కావడం విశేషం. తొలి స్థానంలో 1979-80లో చెన్నై వేదికగా అలెన్ బోర్డర్- హ్యూజెస్లు కలిసి 222 పరుగులు జోడించారు. ఇక మూడో స్థానంలో ఓ నీల్- హార్వే జంట 1959-60లో ముంబై వేదికగా 207 పరుగులు జోడించారు. అయితే డెబ్యూ సెంచరీ అందుకున్న కామెరాన్ గ్రీన్ఫై ప్రశంసల వర్షం కురిపిస్తున్న వేళ టీమిండియా అభిమానులు మాత్రం వినూత్న రీతిలో స్పందించారు. తొలి టెస్టు శతకం అందుకున్నందుకు కంగ్రాట్స్.. కానీ పోయి పోయి టీమిండియాపైనే అది సాధించాలా అంటూ కామెంట్ చేశారు. అయితే సెంచరీ తర్వాత మరో 14 పరుగులు చేసిన గ్రీన్ 114 వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్‌లో భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. Cameron Green celebrates his maiden Test century 👏 LIVE ▶️ https://t.co/BG0U48XqPn#INDvAUS pic.twitter.com/u4ghdGrgFg — CODE Cricket (@codecricketau) March 10, 2023 చదవండి: 'డొమెస్టిక్ లీగ్స్ వల్ల ప్రమాదంలో ఐసీసీ గ్లోబల్ క్రికెట్' 'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్ భరత్‌కు కోహ్లి ఆదేశం -
'డెబ్యూ సెంచరీ నాన్నకు అంకితం'.. గిల్ ఎమోషనల్
టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ జింబాబ్వేతో మూడో వన్డేలో సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. కాగా గిల్‌కు అంతర్జాతీయ క్రికెట్లో ఇదే డెబ్యూ సెంచరీ. 97 బంతులు ఎదుర్కొన్న గిల్ 130 పరుగులు చేసి జింబాబ్వే గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. సెంచరీ గండంతో అల్లాడిపోయిన గిల్ ఎట్టకేలకు సెంచరీ మార్క్‌ను అందుకోవడంతో సంతోషంలో ముగినిపోయాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన గిల్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ''టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా.. ఎందుకంటే కొంతమంది సీనియర్ క్రికెటర్లతో బ్యాటింగ్ పంచుకోవడం సంతోషంగా ఉంది. అయితే నా ఆటకు ప్రాథమిక గైడ్.. కోచ్ ఎవరో కాదు నా తండ్రి లఖ్వీందర్ సింగ్. ఇవాళ సాధించిన సెంచరీ నాన్నకు అంకితమిస్తున్నా. రెండో వన్డేలో 33 పరుగుల వద్ద ఔటైనప్పుడు నాన్న నుంచి ఫోన్ వచ్చింది. నీ టెక్నిక్‌లో ఎలాంటి లోపం లేదు.. ఆటపై సరిగ్గా దృష్టి పెట్టు.. అద్భుతాలు సాధిస్తావు అని చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని ఇవాళ సెంచరీతో మెరిశాను. ఇక జింబాబ్వే చిన్న జట్టయినా అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా మూడో వన్డేలో అటు బౌలింగ్‌లో బ్రాడ్ ఎవన్స్.. బ్యాటింగ్‌లో సెంచరీతో మెరిసిన సికందర్ రజాకు నా అభినందనలు. అందరూ ఆడుతున్న సమయంలో బాదడం కంటే క్లిష్ట సమయంలో సెంచరీతో ఆడడం అసలైన ఆటగాడిని వెలికితీస్తుంది. వీరిద్దరికి మంచి భవిష్యత్తు ఉంది. ఇక మూడుసార్లు తొంబైల స్కోరు అందుకున్నప్పటికి సెంచరీ సాధించలేకపోయా. అందుకే ఈ సెంచరీ నాకు స్పెషల్'' అంటూ చెప్పుకొచ్చాడు. జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు కలిపి 245 పరుగులు చేసిన గిల్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవడం విశేషం. గిల్‌కు ఇది వరుసగా రెండో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కాగా.. ఇంతకముందు విండీస్‌పై వన్డే సిరీస్‌లోనూ ఈ అవార్డు అందుకున్నాడు. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో గిల్(130 పరుగులు) సెంచరీతో మెరవగా.. ఇషాన్ కిషన్(50), ధావన్(40) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 5 వికెట్లు పడగొట్టగా.. న్యౌచీ, జోంగ్వే తలా వికెట్ సాధించారు. 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది.. తద్వారా భారత్ చేతిలో జింబాబ్వే 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. Special feeling. Going to cherish this one ❤️ pic.twitter.com/AjWPq8RZwn — Shubman Gill (@ShubmanGill) August 22, 2022 చదవండి: Sikandar Raza: పాక్ మూలాలున్న బ్యాటర్.. అయినా సరే మనసు దోచుకున్నాడు IND vs ZIM: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. సచిన్ 24 ఏళ్ల రికార్డు బద్దలు! -
దిగ్గజాల సరసన శ్రేయాస్ అయ్యర్.. 16వ ఆటగాడిగా
Shreyas Iyer Joins Elite Club With Debut Test Century.. టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ డెబ్యూ టెస్టులోనే సెంచరీతో అదరగొట్టాడు. 157 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న అయ్యర్ ఓవరాల్‌గా 105 పరుగులు చేసి ఔటయ్యాడు. అయ్యర్ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కాగా ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన అయ్యర్ గంగూలీ, మహ్మద్ అజారుద్దీన్, సెహ్వాగ్, లాలా అమర్నాథ్ లాంటి దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు. అంతేగాక శ్రేయాస్ అయ్యర్ పలు రికార్డులు సవరించాడు. అదేంటో ఒకసారి పరిశీలిద్దాం. ► టీమిండియా తరపున డెబ్యూ టెస్టులోనే సెంచరీ చేసిన 16వ ఆటగాడు ► డెబ్యూ ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన 13వ ఆటగాడిగా అయ్యర్ ► స్వదేశంలో తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన 10వ ఆటగాడు ► ఇక కాన్పూర్‌లో అరంగేట్రం టెస్టులో సెంచరీ చేసిన రెండో ఆటగాడు అయ్యర్.. ఇంతకముందు గుండప్ప విశ్వనాథ్ ఈ ఘనత అందుకున్నాడు. ► ఇటీవలి కాలంలో తొలి టెస్టులోనే సెంచరీ అందుకున్న వారిలో పృథ్వీ షా, రోహిత్ శర్మల తర్వాత మూడో ముంబై ఆటగాడిగా అయ్యర్ రికార్డు -
సరిగ్గా 25 ఏళ్ల క్రితం
-
సచిన్‌కు ఈరోజు చాలా స్పెషల్!
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రీడాజీవితంలో ఈరోజు (సెప్టెంబర్ 9) చాలా ప్రత్యేకం. 25 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున మాస్టర్ బ్లాస్టర్ వన్డేల్లో తన మొట్టమొదటి సెంచరీ సాధించాడు. అయితే తొలి సెంచరీ సాధించడానికి ఐదేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 1989లో అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన సచిన్ 1994, సెప్టెంబర్ 9న మొదటి సెంచరీ సాధించాడు. 78 మ్యాచ్‌లు ఆడిన తర్వాతే తొలి శతకం అతడి ఖాతాలో పడింది. కొలంబోలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మేటి బౌలర్లను ఎదుర్కొని 130 బంతుల్లో 110 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. టెస్టుల్లో మాత్రం అరంగ్రేటం చేసిన రెండేళ్లలోనే మొదటి సెంచరీ సాధించాడు. అప్పటి నుంచి టీమిండియా బ్యాటింగ్‌కు వెన్నుముకలా నిలిచిన సచిన్ టెండూల్కర్ తన కెరీర్లో ఎన్నో రికార్డులు సాధించాడు. వన్డేల్లో 49 సెంచరీలతో సహా వంద అంతర్జాతీయ శతకాలు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. సచిన్ తొలి వన్డే సెంచరీ సాధించి 25 ఏళ్లు అయిన సందర్భంగా ఆనాటి మధుర ఘట్టాన్ని బీసీసీఐ సోమవారం ట్వీట్ చేసింది. (చదవండి: ‘ఆ బ్యాటింగ్ టెక్నిక్ అతనికే సొంతం’) #OnThisDay in 1994 - Batting great @sachin_rt scored his first ODI hundred. Relive the magic - DD SPORTS#Legend #SRT pic.twitter.com/hgvSm42yKK — BCCI (@BCCI) September 9, 2019 -
రోహిత్ శర్మ తొలి టెస్టు సెంచరీ
కోల్‌కతా: పొట్టి ఫార్మాట్లో సత్తా చాటిన టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ టెస్టుల్లోనూ అదరగొడుతున్నాడు. తొలి టెస్టులోనే సెంచరీ సాధించి తన రాకను ఘనంగా చాటుకున్నాడు. వెస్టిండీస్‌తో ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న మొదటి టెస్టులో రోహిత్ శర్మ శతకం బాదాడు. 194 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌తో తొలి టెస్టు సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన 14వ భారత ఆటగాడిగా నిలిచాడు. -
తొలి టెస్టులోనే సెంచరీ చేసిన రోహిత్
కోల్‌కతా: పొట్టి ఫార్మాట్లో సత్తా చాటిన టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ టెస్టుల్లోనూ అదరగొడుతున్నాడు. తొలి టెస్టులోనే సెంచరీ సాధించి తన రాకను ఘనంగా చాటుకున్నాడు. వెస్టిండీస్‌తో ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న మొదటి టెస్టులో రోహిత్ శర్మ శతకం బాదాడు. 194 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌తో తొలి టెస్టు సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన 14వ భారత ఆటగాడిగా నిలిచాడు. 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను రోహిత్ తన విలువైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. సంయమనంతో ఆడాడు. మంచి బంతులను గౌరవిస్తూ చెత్త బాల్స్‌ను చితక్కొట్టాడు. అశ్విన్ సహకారంతో జట్టుకు ఆధిక్యం సంపాదించిపెట్టాడు. అటు అశ్విన్ అర్థ సెంచరీతో రోహిత్‌కు అండగా నిలిచాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది. దీంతో విండీస్‌పై టీమిండియాకు 120 పరుగుల ఆధిక్యం లభించింది. రోహిత్ 127, అశ్విన్ 92 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.