వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రెండోరోజు ఆట ముగిసేసరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. చిచ్చరపిడుగు యశస్వి జైశ్వాల్ అరంగేట్రం టెస్టులోనే అదరగొడుతూ అజేయ సెంచరీతో మెరవగా.. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా శతకంతో అదరగొట్టాడు. ప్రస్తుతం జైశ్వాల్ (350 బంతుల్లో 143 పరుగులు నాటౌట్), విరాట్ కోహ్లి(96 బంతుల్లో 36 పరుగులు నాటౌట్) క్రీజులో ఉన్నారు.
అంతకముందు రోహిత్ శర్మ(221 బంతుల్లో 103 పరుగులు) చేసి ఔటయ్యాడు. ఆటకు ఇంకా మూడు రోజులు సమయం ఉండడం.. రహానే, జడేజా, ఇషాన్ కిషన్‌లు బ్యాటింగ్‌కు రావాల్సి ఉండడంతో టీమిండియా భారీ స్కోరు చేసే అవకాశముంది. ఇక అరంగేట్రం టెస్టులోనే సెంచరీతో అదరగొట్టిన యశస్వి జైశ్వాల్ రికార్డుల మోత మోగించాడు. వాటి విశేషాలు ఒకసారి పరిశీలిద్దాం.
► టీమిండియా తరపున డెబ్యూ టెస్టులో సెంచరీ బాదిన 17వ ఆటగాడిగా.. మూడో ఓపెనర్‌గా నిలిచాడు. ఇంతకముందు శిఖర్ ధావన్(2016లో), పృథ్వీ షా(2018లో) ఈ ఘనత సాధించారు. విదేశాల్లో అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాదిన తొలి భారత ఓపెనర్‌గానూ జైశ్వాల్ చరిత్రకెక్కాడు.
► ఇక విదేశాల్లో అరంగేట్రం టెస్టులో సెంచరీ బాదిన ఐదో భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఇంతకముందు అబ్బాస్ అలీ 1959లో ఇంగ్లండ్ గడ్డపై, 1976లో సురిందర్ అమర్‌నాథ్ న్యూజిలాండ్‌పై ఆక్లాండ్ వేదికగా, 1992లో ప్రవీణ్ ఆమ్రే సౌతాఫ్రికాపై డర్బన్ వేదికగా, 1996లో సౌరవ్ గంగూలీ లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌పై, 2001లో సౌతాఫ్రికాపై వీరేంద్ర సెహ్వాగ్ ఈ ఘనత సాధించారు.
► అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాదిన నాలుగో యంగెస్ట్ భారత క్రికెటర్‌గా జైశ్వాల్(21 ఏళ్ల 196 రోజులు) నిలిచాడు. ఈ జాబితాలో పృథ్వీ షా, అబ్బాస్ అలీ బేగ్, గుండప్ప విశ్వనాథ్‌లు ఉన్నారు.
► ఇక 91 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ గడ్డపై టీమిండియా తరపున అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా జైశ్వాల్ రికార్డులకెక్కాడు.
► రీసెంట్‌గా చూసుకుంటే జైశ్వాల్ కంటే ముందు శ్రేయాస్ అయ్యర్ 2021లో న్యూజిలాండ్‌పై అరంగేట్రం టెస్టులో సెంచరీ బాదిన క్రికెటర్‌గా నిలిచాడు.
यशस्वी भवः 💯
— FanCode (@FanCode) July 13, 2023
.
.#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/59Uq9ik1If
చదవండి: Ind vs WI: అశ్విన్ అరుదైన ఘనత.. మూడో భారత బౌలర్‌గా చరిత్ర
Comments
Please login to add a commentAdd a comment