IND vs WI, 2nd Test Day 2: West Indies Trail India By 352 Runs At Stumps - Sakshi
Sakshi News home page

WI Vs IND 2nd Test: 352 పరుగుల వెనుకంజలో విండీస్‌.. భారత్‌ పట్టు బిగిస్తుందా?

Published Sat, Jul 22 2023 7:16 AM | Last Updated on Sat, Jul 22 2023 8:47 AM

West Indies Trail By 352 Runs-1st-Innings Vs IND 2nd Test-Day-2 Ends - Sakshi

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించే యోచనలో ఉంది. రెండోరోజు దాదాపు రెండు సెషన్ల పాటు బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 400 మార్క్‌ దాటింది. కోహ్లి సెంచరీతో ఆకట్టుకున్నాడు. లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌ అయిన కోహ్లి మరికొద్ది సేపు ఉండుంటే టీమిండియా కచ్చితంగా 500 మార్క్‌ అందుకునేది. ఇక అశ్విన్‌, జడేజాలు హాఫ్‌ సెంచరీలతో రాణించారు. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌట్‌ అయింది.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన విండీస్‌ తొలి టెస్టు మాదిరిగా కాకుండా కాస్త నిలకడగా ఆడింది. తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించిన అనంతరం తగ్‌నరైన్‌ చందర్‌పాల్‌(33 పరుగులు) జడేజాకు దొరికిపోయాడు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి 41 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 81 పరుగులు చేసిన విండీస్‌ మరో 352 పరుగులు వెనుకబడి ఉంది. ఓపెనర్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌(37 పరుగులు బ్యాటింగ్‌), కిర్క్‌ మెకెంజీ(14 పరుగులు బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. మూడోరోజు ఆటలో భారత బౌలర్లను ఎదుర్కొని ఎంతవరకు నిలబడతారనే దానిపై విండీస్‌ భవితవ్యం ఆధారపడి ఉంది.  

చదవండి: పాణీరావు కన్నుమూత.. బ్యాడ్మింటన్‌తో నాలుగు దశాబ్దాల అనుబంధం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement