Kolkata Test
-
పింక్ పదనిసలు...
భారత క్రికెట్ జట్టులో కీలక సభ్యులకు ప్రాక్టీస్ లేదు... బంగ్లాదేశ్ ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు... తొలి టెస్టు ముగిసిన తర్వాత రెండో టెస్టు కోసం సన్నద్ధమయ్యేందుకు ఉన్న సమయం కూడా చాలా తక్కువ. అయినా సరే మార్పు మంచిదే అంటూ తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహణకు బీసీసీఐ సిద్ధమైపోయింది. ఎలాగైనా తన హయాంలో ఈ పని పూర్తి చేయాలని భావించిన సౌరవ్ గంగూలీ తీసుకొన్న చొరవతో కోల్‌కతా టెస్టుకు గులాబీ హంగులు చేకూరబోతున్నాయి. అయితే రెగ్యులర్ డే టెస్టు మ్యాచ్‌కు భిన్నం కాబట్టి సహజంగానే నిర్వహణలో కొత్త సమస్యలు కూడా ఖాయం. బంతి మన్నిక మొదలు పిచ్, అవుట్ ఫీల్డ్, వాతావరణం, లైటింగ్... ఇలా అన్నీ మ్యాచ్‌పై ప్రభావం చూపిస్తాయి. టీమిండియా నవంబర్ 22 నుంచి తొలి డే అండ్ నైట్ మ్యాచ్ ఆడబోతున్న నేపథ్యంలో ‘పింక్ టెస్టు’కు ఎదురు కాబోయే సవాళ్లపై ప్రత్యేక కథనం. మంచు ప్రభావం ఇప్పటి వరకు 11 డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లు నిర్వహించినా... అందులో ఒక్కటి కూడా శీతాకాలపు సీజన్లో జరగలేదు. 9 మ్యాచ్‌లు వేసవిలో జరగ్గా, మరో 2 మ్యాచ్‌లు అసలు శీతల వాతావరణమే ఉండని దుబాయ్‌లో నిర్వహించారు. భారత్‌లో ఇప్పటి వరకు జరిగిన 12 ఫస్ట్‌క్లాస్ డే అండ్ నైట్ మ్యాచ్‌లన్నీ పెద్దగా మంచు ప్రభావం కనిపించని ఆగస్టు, సెపె్టంబర్లలోనే నిర్వహించారు. నవంబర్ నెలలో భారత్‌లో మ్యాచ్‌లు అంటే రాత్రి పూట ఎప్పుడైనా మంచు ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. బంతిపై బౌలర్లకు పట్టు చిక్కకపోవడం, బ్యాట్స్‌మెన్ పని సులువు కావడం వన్డేల్లోనే తరచుగా కనిపించే దృశ్యం. ఎక్కువ ఓవర్లు వేయాల్సి వచ్చే టెస్టులో బౌలర్లు ఏం చేయగలరనేది పెద్ద సమస్య. అయితే దీనికి తమ వద్ద పరిష్కారం ఉందని గంగూలీ చెబుతున్నాడు. ‘డ్యూ ట్రీట్మెంట్ స్ప్రే’ను వాడి మంచు ప్రభావం తగ్గిస్తామని, ఎలాంటి ఇబ్బందీ ఉండదని అతను అన్నాడు. సీనియర్ పిచ్ క్యురేటర్ దల్జీత్ సింగ్ మరో సూచన ఇచ్చాడు. ‘పిచ్‌పై కాస్త ఎక్కువ పచ్చికను ఉంచితే బంతి ఎక్కువగా మన్నుతుంది. అవుట్‌ఫీల్డ్‌పై గడ్డిని తక్కువగా ఉంచితే మంచు ప్రభావం కూడా తగ్గుతుంది’ అని ఆయన అన్నారు. మ్యాచ్ సమయం.... ప్రస్తుతానికి అధికారికంగా మ్యాచ్ నిర్వహణా సమయాన్ని బోర్డు ప్రకటించలేదు. అయితే మంచు ప్రభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటూ మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. అదే జరిగితే మ్యాచ్ రాత్రి 8.30 గంటల వరకు సాగుతుంది. అంటే దాదాపు రెండు సెషన్లు డే గానే సాగుతాయి. చివరి సెషన్ మాత్రమే పూర్తిగా ఫ్లడ్‌లైట్ల వెలుగులో జరుగుతుంది. కానీ అలాంటప్పుడు డే అండ్ నైట్ టెస్టు ఉద్దేశం నెరవేరదు. ప్రేక్షకులకు డే అండ్ నైట్ టెస్టు అనుభూతి దక్కాలంటే ఐపీఎల్ మ్యాచ్ ముగిసే సమయానికే (దాదాపు రా.11 గంటలు) టెస్టు కూడా ముగిసే విధంగా సమయం నిర్ధారిస్తే బాగుంటుందనేది సూచన. ఆటగాళ్ల అనుభవం... ప్రస్తుత భారత టెస్టు జట్టు సభ్యుల్లో పుజారా, మయాంక్, రిషభ్ పంత్, కుల్దీప్లకు దులీప్ ట్రోఫీలో గులాబీ బంతితో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది. 2016 ఫైనల్లో పుజారా డబుల్ సెంచరీ కూడా చేశాడు. షమీ, సాహా ‘క్యాబ్’ క్లబ్ మ్యాచ్‌లో ఈ బంతితో ఆడారు. మిగతా ఆటగాళ్లందరికీ పింక్ బాల్ పూర్తిగా కొత్త. బంగ్లాదేశ్లోనైతే ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ డే అండ్ నైట్ జరిగింది. అందులో ప్రధాన ఆటగాళ్లెవరూ లేరు. కాబట్టి అనుభవంపరంగా చూస్తే భారత్‌దే పైచేయిగా చెప్పవచ్చు. 72 బంతులకు ఆర్డర్... కోల్‌కతా టెస్టు కోసం బీసీసీఐ ఎస్జీ కంపెనీకి 72 గులాబీ బంతుల కోసం ఆర్డర్ ఇచ్చింది. కొన్నాళ్లుగా ఎస్జీ ఎరుపు బంతుల విషయంలోనే భారత క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో మరింత నాణ్యతతో పింక్ బంతులను తయారు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఎరుపు బంతితో పోలిస్తే గులాబీ బంతులకు తొందరగా దుమ్ము అంటుకుంటుంది. వేగంగా రంగు వెలసిపోయి నల్లగా మారిపోతున్నాయనేది ప్రధాన ఫిర్యాదు. దీనిని సరిదిద్దుతూ మంచి బంతులు అందిస్తామని ఎస్జీ చెబుతోంది. మొత్తంగా ఎరుపు, పింక్ మధ్య పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఎరుపు బంతిపై సీమ్ తెలుపు రంగులో ఉంటే పింక్ బాల్‌పై బాగా కనిపించేందుకు నలుపు సీమ్ వాడతారు. పింక్ బంతి కళ కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి దానిపై గ్రీజ్ కూడా పూయరు. పింక్ బంతుల నాణ్యత... ఎస్జీ పింక్ బంతులతో జరగబోతున్న మొదటి టెస్టు మ్యాచ్ ఇది. గతంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్‌ల సమయంలో ఆటగాళ్లు బంతులపై కొంత అసంతృప్తిని ప్రదర్శించారు. అప్పుడు కూకాబుర్రా బంతులు వాడారు. మ్యాచ్ ప్రారంభమైనప్పుడు, ఫ్లడ్‌లైట్లు వేసినప్పుడు ఇబ్బంది లేకున్నా ఈ రెండింటి మధ్య (దాదాపు సూర్యాస్తమయం సమయంలో) బంతి సరిగా కనిపించడం లేదని, నారింజ రంగులో ఉంటోందని బ్యాట్స్‌మెన్ ఫిర్యాదు చేశారు. 10 ఓవర్లు దాటితే ఏమాత్రం ప్రభావం చూపడం లేదని పేసర్లు చెప్పగా, బంతి అసలు టర్న్ కావడం లేదని స్పిన్నర్లు మొరపెట్టుకున్నారు. రివర్స్ స్వింగ్ అయితే ఏమాత్రం పని చేయలేదు. ఇప్పుడు ఎస్జీ బంతులకు బోర్డు ఏమైనా ప్రత్యేక సూచనలు చేసి బంతులు తయారు చేయించిందా చూడాలి. ప్రేక్షకుల ఆదరణ పెరుగుతుందా! ఫ్లడ్‌లైట్లలో ఆడించగానే టెస్టులకు జనం పోటెత్తుతారా అనేది సందేహమే. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి పేలవ స్పందన లభించింది. దాంతో కోహ్లి కూడా కొంత అసహనానికి గురై చాలా ఏళ్లుగా టెస్టు క్రికెట్‌ను ఆదరిస్తున్న ఐదు ప్రధాన వేదికలకే మ్యాచ్‌లను పరిమితం చేయాలని సూచించాడు. స్టేడియాలు దూరంగా ఉండటం, సౌకర్యాలు లేకపోవడం కూడా దీనికి కారణం కాగా... గంగూలీ మాత్రం విభేదిస్తూ ఐపీఎల్ మ్యాచ్‌లకు రావడం లేదా అని ప్రశి్నంచాడు. డే అండ్ నైట్ టెస్టులకు ఆకర్షణ ఉంటుందని మొదటి నుంచి చెబుతూ వచ్చిన అతను కోల్‌కతా పింక్ టెస్టు కోసం కోహ్లిని కూడా ఒప్పించాడు. అయితే ఈడెన్ గార్డెన్స్‌లో మొదటి నుంచి టెస్టులకు మంచి ఆదరణే దక్కుతోంది. ఇప్పుడు పింక్ టెస్టుకు ఇంకా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు రావడంలో ఆశ్చర్యం లేదు. కాబట్టి దీనిని టెస్టుల మనుగడకు ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా కారణం చేత అనుకున్న స్థాయిలో జనాలు రాలేదూ అంటే ఇక మన దేశంలో టెస్టులకు రోజులు దగ్గర పడినట్లే అనుకోవాలి! -
ప్రత్యర్థి హేళన.. ద్రావిడ్ సమాధానం ఎలాగంటే...
సాక్షి, స్పోర్ట్స్ : అది 2001 ఈడెన్ గార్డెన్ మైదానం. ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 445 పరుగులు చేయగా.. భారత్ కేవలం 171 రన్స్‌కే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. ఆటగాళ్ల పేలమైన ఫామ్.. పైగా 274 పరుగులతో వెనుకబడి ఉంది. మ్యాచ్ పోయినట్లేనని అంతా నిరుత్సాహాంలో ఉన్నారు. కానీ, లక్ష్మణ్, ద్రావిడ్ ఆడిన వీరోచిత ఇన్నింగ్స్.. ఆపై బంతితో హర్భజన్ సింగ్ చేసిన మ్యాజిక్ భారత్ ను విజయతీరాలకు చేర్చింది. అనూహ్యమైన ఆ ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలోనే ఓ అద్భుతంగా క్రికెట్ పండితులు అభివర్ణిస్తుంటారు. ఇక మ్యాచ్‌లో ద్రావిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆటగాళ్లంతా పెవిలియన్ కు క్యూ కట్టిన క్రమంలో ద్రావిడ్ క్రీజులోకి వచ్చాడు. అప్పటికే ద్రావిడ్ ఫామ్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. గత కొన్ని మ్యాచ్‌ల్లో మరీ దారుణమైన ప్రదర్శన ఆయన ఇచ్చారు. అందుకే ఆయన్ని ఆరోస్థానంలో బరిలోకి పంపారు. అప్పుడు ఆసీస్ కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ వా స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. ఏం ద్రావిడ్.. ఈ ఇన్నింగ్స్‌లో ఆరో స్థానం.. తర్వాత ఏంటి? 12వ స్థానమా? అంటూ హేళన చేశాడు. కానీ, ద్రావిడ్ మాత్రం అవేం పట్టనట్లు క్రీజులోకి వెళ్లిపోయాడు. లక్ష్మణ్ కు జత కలిసిన ద్రావిడ్.. ఆట స్వరూపమే మారిపోయింది. బౌలర్లు ఎందరు మారుతున్నా... చెమట చిందించినా లాభం లేకపోయింది. ద్రావిడ్-లక్ష్మణ్ ద్వయం చితకబాదుతూనే ఉన్నారు. ముఖ్యంగా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌ను ఇద్దరూ ఓ ఆటాడేసుకున్నారు. వీరోచిత బ్యాటింగ్ కారణంగా 376 పరుగుల భాగస్వామ్యంతో భారత్ 657 పరుగులు చేసింది. ఆపై భజ్జీ మాయాజాలంతో ఆస్ట్రేలియా 212 పరుగులకే కుప్పకూలటంతో 171 పరుగుల చరిత్రాత్మక విజయం సాధించింది. తాజాగా బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ద్రావిడ్ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘‘ఆ సమయంలో నా ఫామ్ నిజంగా బాగోలేదు. మైదానంలోకి వెళ్లేముందు వా మాటలు నా చెవిని తాకాయి. కానీ, నా దృష్టిని మరలించలేకపోయాయి. అప్పుడు నేను ఆలోచించింది ఒక్కటే. గతం, భవిష్యత్ రెండూ ఇప్పుడు నా చేతుల్లో లేవు. ప్రస్తుతం నా ముందు ఉన్నది ఒక్కటే. వీలైనన్నీ బంతిని ఎదుర్కోవటం... పరుగులు సాధించటం. ఈ క్రమంలో లక్ష్మణ్ తో భాగస్వామిని కావటం అదృష్టంగా భావిస్తున్నా. జీవితంలో కష్టకాలం ఎదురైనప్పుడు వాటిని ఎలా అధిగమించాలో చూడాలి తప్ప.. వెనకడుగు వేసేందుకు యత్నించకూడదు. ’’ అని ద్రావిడ్ సభికులను ఉద్దేశించి పేర్కొన్నారు. కాగా, ఈడెన్ గార్డెన్స్‌లో వీవీఎస్ లక్ష్మణ్ (281) చిరస్మరణీయ ఇన్నింగ్స్ గడచిన అర్ధ శతాబ్దపు అత్యుత్తమ ప్రదర్శనగా గౌరవం కూడా అందుకుంది. -
ఫోర్‌తో.. 250 మార్క్ దాటింది
కోల్‌కతా: భారత్-న్యూజిలాండ్ రెండో టెస్టు రెండో రోజు ఆట శనివారం కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో ఆరంభమైంది. 239/7 ఓవర్‌నైట్ స్కోరుతో భారత బ్యాట్స్‌మెన్ వృద్దిమాన్ సాహా, రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్ కొనసాగించారు. దూకుడుగా ఆడుతున్న సాహా రెండో బంతిని ఫోర్ కొట్టాడు. సాహా మరో ఫోర్ కొట్టడంతో టీమిండియా స్కోరు 250 మార్క్ దాటింది. ప్రస్తుతం భారత్ స్కోరు 259/7. సాహా (26), జడేజా (4) క్రీజులో ఉన్నారు. భువనేశ్వర్, మహ్మద్ షమీ బ్యాటింగ్‌కు దిగాల్సివుంది. -
రెండో టెస్టు: న్యూజిలాండ్‌కు షాక్
కోల్‌కతా: భారత్‌తో తొలి టెస్టులో ఓటమి చవిచూసిన న్యూజిలాండ్‌కు రెండో టెస్టు ఆరంభానికి ముందే ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతాలో జరుగుతున్న ఈ కీలక మ్యాచ్‌కు న్యూజిలాండ్ కెప్టెన్, టాప్ బ్యాట్స్‌మన్ విలియమ్సన్ అనారోగ్యం కారణంగా దూరమయ్యాడు. ఇప్పటికే గాయాల కారణంగా కీలక ఆటగాళ్లను కోల్పోయిన కివీస్‌కు.. విలియమ్సన్ కూడా దూరమవడం పెద్ద సమస్యే. మ్యాచ్ సమయానికి విలియమ్సన్ కోలుకుంటాడని టీమ్ మేనేజ్మెంట్ ఆశించినా నిరాశే ఎదురైంది. కోల్‌కతా టెస్టుకు న్యూజిలాండ్ కెప్టెన్‌గా రాస్ టేలర్‌ను నియమించారు. శుక్రవారం కోల్‌కతాలో ఆరంభమైన రెండో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు టెస్టులో సిరీస్‌లో విరాట్ కోహ్లీ సేన 1-0తో ముందంజలో నిలిచిన సంగతి తెలిసిందే. కాన్పూర్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. -
విండీస్‌పై భారత్ ఇన్నింగ్స్ విజయం
-
విండీస్‌పై భారత్ ఇన్నింగ్స్ విజయం
కోల్‌కతా: తొలి టెస్టులో వెస్టిండీస్ ను భారత్ చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, బౌలింగ్‌లో మహ్మద్ షమీ సత్తా చాటడంతో వెస్టిండీస్‌పై భారత్ ఇన్నింగ్స్ 51 పరుగులతో విజయం సాధించింది. అరంగ్రేట టెస్టులో రోహిత్, షమీ అదరగొట్టడంతో టీమిండియా మరో రెండు రోజులు మిగులుండగానే విజయాన్ని అందుకుంది. 219 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ 168 పరుగులకే కుప్పకూలింది. సొంత మైదానంలో టెస్టు అరంగ్రేటం చేసిన షమీ సత్తా చాటాడు. భారత్ తరపున రెండో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. షమీ ధాటికి విండీస్ వికెట్లు పేక మేడలా కూలిపోయాయి. 118 పరుగులిచ్చి ఏకంగా 9 వికెట్లు నేలకూల్చాడు. రెండో ఇన్నింగ్స్ లో 13.1 ఓవర్లలో 47 పరుగులు మాత్రమే ఇచ్చిన షమీ ఏకంగా 5 వికెట్లు నేలకూల్చాడు. అశ్విన్ 3 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో షమీ 4 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 453 పరుగులకు ఆలౌటయింది. రోహిత్ శర్మ 177, అశ్విన్ 124 పరుగులు చేశారు. రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. -
కోల్‌కతా టెస్ట్‌లో అశ్విన్ సెంచరీ
-
కోల్‌కతా టెస్ట్‌లో అశ్విన్ సెంచరీ
కోల్‌కతా : కోల్‌కతా టెస్ట్‌లో యువ స్పిన్నర్, టీమిండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ చేశాడు. 159 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో అశ్విన్‌కు ఇది రెండో సెంచరీ. విండీస్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి టెస్టులో నిన్న రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 102 ఓవర్లలో 6 వికెట్లకు 354 పరుగులు చేసింది. మూడోరోజు ఆట ప్రారంభించిన భారత్ జట్టు ఆ దూకుడును కొనసాగిస్తోంది. 92 పరుగులతో అజేయంగా నిలిచిన అశ్విన్ శుక్రవారం ఉదయం ఓ బౌండరీ నాలుగు సింగిల్స్‌తో హండ్రెడ్ మైలురాయిని చేరుకున్నాడు. విండీస్ బౌలర్ టీనో బెస్ట్ వేసిన బాల్‌ను అశ్విన్ స్వీపర్ కవర్ వైపు తరలించి తీసిన సింగిల్‌తో అశ్విన్ తన కెరీర్లో రెండో సెంచరీని కంప్లీట్ చేశాడు. రెండేళ్ల క్రితం వెస్టిండీస్ మీద ముంబైలో 103 పరుగులు చేసిన అశ్విన్‌కు కెరీర్లో ఇది హయ్యెస్ట్ స్కోరు. సెంచరీ నేపథ్యంలో అశ్విన్ పిడికిలి బిగించి చేతిని గాల్లోకి విసిరి తన ఆనందాన్ని చాటాడు . ఈ సెంచరీలో 11 ఫోర్లే వుండటం స్ట్రయికింగ్ రొటేషన్‌కు అశ్విన్ ప్రయారిటీ ఇచ్చినట్టు వెల్లడైంది. ఇప్పటికే సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ .....150 పరుగులు పూర్తి చేసి డబుల్ సెంచరీ దిశగా ఆడుతున్నాడు. వీరిద్దరూ 250 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు. -
రోహిత్ శర్మ తొలి టెస్టు సెంచరీ
కోల్‌కతా: పొట్టి ఫార్మాట్లో సత్తా చాటిన టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ టెస్టుల్లోనూ అదరగొడుతున్నాడు. తొలి టెస్టులోనే సెంచరీ సాధించి తన రాకను ఘనంగా చాటుకున్నాడు. వెస్టిండీస్‌తో ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న మొదటి టెస్టులో రోహిత్ శర్మ శతకం బాదాడు. 194 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌తో తొలి టెస్టు సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన 14వ భారత ఆటగాడిగా నిలిచాడు. -
తొలి టెస్టులోనే సెంచరీ చేసిన రోహిత్
కోల్‌కతా: పొట్టి ఫార్మాట్లో సత్తా చాటిన టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ టెస్టుల్లోనూ అదరగొడుతున్నాడు. తొలి టెస్టులోనే సెంచరీ సాధించి తన రాకను ఘనంగా చాటుకున్నాడు. వెస్టిండీస్‌తో ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న మొదటి టెస్టులో రోహిత్ శర్మ శతకం బాదాడు. 194 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌తో తొలి టెస్టు సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన 14వ భారత ఆటగాడిగా నిలిచాడు. 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను రోహిత్ తన విలువైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. సంయమనంతో ఆడాడు. మంచి బంతులను గౌరవిస్తూ చెత్త బాల్స్‌ను చితక్కొట్టాడు. అశ్విన్ సహకారంతో జట్టుకు ఆధిక్యం సంపాదించిపెట్టాడు. అటు అశ్విన్ అర్థ సెంచరీతో రోహిత్‌కు అండగా నిలిచాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది. దీంతో విండీస్‌పై టీమిండియాకు 120 పరుగుల ఆధిక్యం లభించింది. రోహిత్ 127, అశ్విన్ 92 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.