కోల్కతా టెస్ట్లో అశ్విన్ సెంచరీ
కోల్కతా : కోల్కతా టెస్ట్లో యువ స్పిన్నర్, టీమిండియా ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ చేశాడు. 159 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేశాడు. టెస్ట్ల్లో అశ్విన్కు ఇది రెండో సెంచరీ. విండీస్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి టెస్టులో నిన్న రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 102 ఓవర్లలో 6 వికెట్లకు 354 పరుగులు చేసింది. మూడోరోజు ఆట ప్రారంభించిన భారత్ జట్టు ఆ దూకుడును కొనసాగిస్తోంది.
92 పరుగులతో అజేయంగా నిలిచిన అశ్విన్ శుక్రవారం ఉదయం ఓ బౌండరీ నాలుగు సింగిల్స్‌తో హండ్రెడ్ మైలురాయిని చేరుకున్నాడు. విండీస్ బౌలర్ టీనో బెస్ట్ వేసిన బాల్‌ను అశ్విన్ స్వీపర్ కవర్ వైపు తరలించి తీసిన సింగిల్‌తో అశ్విన్ తన కెరీర్‌లో రెండో సెంచరీని కంప్లీట్ చేశాడు.
రెండేళ్ల క్రితం వెస్టిండీస్ మీద ముంబైలో 103 పరుగులు చేసిన అశ్విన్‌కు కెరీర్‌లో ఇది హయ్యెస్ట్ స్కోరు. సెంచరీ నేపథ్యంలో అశ్విన్ పిడికిలి బిగించి చేతిని గాల్లోకి విసిరి తన ఆనందాన్ని చాటాడు . ఈ సెంచరీలో 11 ఫోర్లే వుండటం స్ట్రయికింగ్ రొటేషన్‌కు అశ్విన్ ప్రయారిటీ ఇచ్చినట్టు వెల్లడైంది. ఇప్పటికే సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ .....150 పరుగులు పూర్తి చేసి డబుల్ సెంచరీ దిశగా ఆడుతున్నాడు. వీరిద్దరూ 250 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు.