rohit sarma
-
రోహిత్ శర్మ అపార్ట్మెంట్స్ అద్దెకు.. నెలకు లక్షల్లో సంపాదన
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే రీతిలో.. సినిమా, క్రికెట్ రంగానికి చెందిన చాలామంది ప్రముఖులు రియల్ ఎస్టేట్ వైపు ఆసక్తి చూస్తున్నారు. ఇప్పటికే కార్తిక్ ఆర్యన్, మనోజ్ బాజ్పేయీ, అజయ్ దేవ్‌గణ్, సారా అలీఖాన్, కాజోల్ వంటి పలువురు ప్రముఖులు ముంబైలో ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. అయితే.. ఇటీవల క్రికెటర్ 'రోహిత్ శర్మ' ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలోని తన రెండు అపార్ట్మెంట్లను లీజుకు ఇచ్చినట్లు తెలిసింది. రోహిత్ శర్మ ఈ అపార్ట్మెంట్లను మూడేళ్ల వ్యవధికి లీజుకి ఇచ్చినట్లు సమాచారం. ఈ అద్దె మొదటి సంవత్సరం ప్రతి నెలా రూ. 3.1 లక్షలు, రెండో సంవత్సరం నెలకు రూ. 3.25 లక్షలు, మూడో సంవత్సరం నెలకు రూ. 3.41 లక్షల అద్దెకు ఒప్పందం కురుర్చుకున్నారు. దీనికి సంబంధించిన రెంట్ అగ్రిమెంట్ 2024 జనవరి 4న జరిగినట్లు తెలిసింది. అద్దెదారు డిపాజిట్ రూపంలో అడ్వాన్స్ కింద రూ. 9.3 లక్షలు చెల్లించారని సమాచారం. ఈ రెండు అపార్ట్మెంట్లు 14వ అంతస్థులో 1047 చదరపు అడుగులు విస్తరించి ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ అంతకు ముందు కూడా 2022లో రెండు అపార్ట్మెంట్లను నెలకు రూ. 2.5 లక్షల అద్దెకు ఇచ్చారు. ఇతర సెలబ్రిటీలు సెలబ్రిటీలు తమ ఆస్తులను లీజుకు/అద్దెకు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో తన ఫ్లాట్‌ను నెలకు రూ.1.50 లక్షల అద్దె చొప్పున మూడేళ్లకు ఇచ్చినట్లు తెలిసింది. ఇదీ చదవండి: బడ్జెట్ 2024పై ఆశలు పెట్టుకున్న ఈవీ రంగం.. సబ్సిడీ కొనసాగుతుందా? అమితాబ్ బచ్చన్ ముంబైలోని ఓషివారా ప్రాంతంలో సుమారు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు వాణిజ్య యూనిట్లను అద్దెకు ఇస్తున్నారు. ఈ స్పేస్ కోసం మూడు సంవత్సరాల లీజుకు 'వార్నర్ మ్యూజిక్ ఇండియా లిమిటెడ్' రూ.1.03 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించినట్లు సమాచారం. దీని ద్వారా అమితాబ్ సంవత్సరానికి రూ.2.07 కోట్లు అద్దె సంపాదిస్తున్నారు. నాలుగవ సంవత్సరం నుంచి అద్దె ఏడాదికి రూ.2.38 కోట్లకు చేరనుంది. -
T20 Format: ఆ జట్టు కెప్టెన్‌గా ధోని.. ఓపెనర్‌గా రోహిత్!
Evin Lewis picks his all time T20I playing XI: రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ తన ఆల్-టైమ్ టీ20 ఫ్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ ట్విటర్లో పోస్ట్ చేసింది. తను ప్రకటించిన జట్టుకు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిని కెప్టెన్‌గా లూయిస్ ఎంచుకున్నాడు. అదే విధంగా.. యూనివర్స్‌ల్ బాస్ క్రిస్ గేల్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. ఇక రన్ మిషన్ విరాట్ కోహ్లికు మూడో స్ధానంలో, సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌కు నాలుగో స్ధానంలో చోటు దక్కింది. జట్టులో ఐదో స్థానంలో వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్‌కు అవకాశం ఇచ్చాడు ఎవిన్ లూయిస్. భారత్‌కు 2007లో టీ20 ప్రపంచకప్ అందించిన ధోనీని తన టీమ్‌కి వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా లూయిస్ ఎంచుకున్నాడు. ఆల్‌రౌండర్ కోటాలో ఆండ్రీ రస్సెల్, రవీంద్ర జడేజాకు చోటు కల్పించాడు. తన జట్టులో ఏకైక స్పిన్నర్‌గా రషీద్ ఖాన్‌ను లూయిస్ ఎంపిక చేశాడు. ఫాస్ట్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్‌కు తన జట్టులో లూయిస్ స్థానం కల్పించాడు. చదవండి: Virat Kohli: మంచు కొంప ముంచుతోంది.. ఒక్కటి మినహా టీమిండియా మ్యాచ్‌లన్నీ అక్కడే.. టాస్ ఓడితే ఇక అంతేనా? ఎవిన్ లూయిస్ ఆల్-టైమ్ టీ20 XI: క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, కీరన్ పొలార్డ్, ఎంస్ ధోని (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రవీంద్ర జడేజా, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్. చదవండి: T20 World Cup 2021: టాస్ గెలిస్తేనే విజయం.. శ్రీలంక లాంటి జట్లకు నష్టం: జయవర్ధనే var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రోహిత్ శర్మ ఎల్బీపై ఫ్యాన్స్ ఫైర్!
లీడ్స్: లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఔటైన తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రెండో ఇన్నింగ్స్ 48వ ఓవర్లో ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్సన్ బౌలింగ్‌లో బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు రోహిత్ శర్మ ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్‌కి తగలకుండా బంతి నేరుగా వెళ్లి ఫ్యాడ్‌ని తాకింది. వెంటనే ఇంగ్లండ్ టీమ్ ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో ఔటిచ్చాడు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రోహిత్ వెంటనే రివ్యూ తీసుకున్నాడు. రిప్లైలో ఆఫ్ స్టంప్ లైన్‌పై పడిన బంతి లెగ్ స్టంప్‌ని కొద్దిగా తాకుతూ వెళ్లేలా కనిపించింది. దాంతో టీవీ అంపైర్ దానిని అంపైర్స్ కాల్‌గా ప్రకటించాడు. ఫీల్డ్ అంపైర్ తన మునుపటి ఔట్ నిర్ణయానికే కట్టుబడ్డాడు. అంపైర్స్ కాల్ నిర్ణయంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, నియమం ప్రకారం కనీసం 50 శాతం బంతి స్టంప్స్‌ని తాకాలి, కానీ అభిమానులు కేవలం 10-20 శాతం మాత్రమే వికెట్‌ను తాకినట్లు భావిస్తున్నారు. అంపైర్ ఔట్ ఇవ్వకపోయి ఉంటే అది అవుట్ అయ్యేది కాదని .. అంపైర్ కాల్ నియమం వింతగా ఉందని అభిమానులు మండిపడుతున్నారు. ఈ నిర్ణయం పట్ల రోహిత్ అసహనం వ్యక్తం చేస్తూనే మైదానం వీడాడు. తొలి ఇన్నింగ్స్ వైఫల్యాల్ని అధిగమించేందుకు భారత బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లో పట్టుదలతో ఆడుతున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ (156 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 59) రాణించగా, చతేశ్వర్ పుజారా(180 బంతుల్లో 15 ఫోర్లతో 91) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. కెప్టెన్ కోహ్లీ (94 బంతుల్లో 6 ఫోర్లతో 45 బ్యాటింగ్) క్రీజులో పాతుకుపోయాడు. ప్రస్తుతం భారత్ ఇంకా 139 పరుగులు వెనుకబడే ఉంది. చదవండి:IND Vs ENG 3rd Test Day 4: అనుకున్నదే జరిగింది.. ఆదిలోనే పుజారా(91) ఔట్ Absolutely ridiculous. Have always believed that DRS has to be decisive, this umpire’s call proves that. Shambolic. #ENGvIND #RohitSharma pic.twitter.com/cmPzrNXPcH — Atharv Warty (@atharvsays) August 27, 2021 -
ఆ రికార్డు అధిగమించేది వార్నరా, రోహితా?
లండన్ : టీమిండియా దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రపంచకప్ టోర్నీలో నెలకొల్పిన అరుదైన రికార్డు బద్దలయ్యే అవకాశం కనిపిస్తోంది. మాస్టర్ బ్లాస్టర్ 2003లో నెలకొల్పిన వ్యక్తిగత అత్యధిక పరుగులు (673) రికార్డు ఇంకా పదిలంగా ఉంది. ఆ తర్వాత మూడు ప్రపంచకప్‌లు జరిగినా ఆ ఘనతను అందుకున్న ఆటగాడే లేడు. అయితే తాజా ప్రపంచకప్‌లో ఆనాటి రికార్డు బ్రేక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 440 పరుగులతో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డెవిడ్ వార్నర్ అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ 425 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ఆరోన్ ఫించ్ (396), జోరూట్ (367), రోహిత్ శర్మ (319)లు ఉన్నారు. వీరంతా ఇదే ఫామ్‌లో చెలరేగితో సచిన్ రికార్డు అధిగమించవచ్చు. ముఖ్యంగా ప్రస్తుత రన్‌రేట్‌ను పరిగణిస్తే ఇది సాధ్యమే అనిపిస్తోంది. 6 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ వార్నర్ 75 పరుగుల సగటుతో 447 పరుగులు చేశాడు. ఇంకా వార్నర్ మూడు లీగ్ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. డేటా ఇంటలిజెన్స్ అంచనా ప్రకారం వార్నర్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. ఇదే సగటుతో మరో 224 పరుగులు చేసి సచిన్ రికార్డుకు 3 పరుగుల దూరంలో నిలవనున్నాడు. ప్రస్తుతం పాయింట్స్ ప్రకారం ఆసీస్ జట్టుకు సెమీస్ వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కావునా.. వార్నర్‌కు సచిన్ రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉంది. షకీబ్ అల్ హసన్ 85 పరుగుల రేటింగ్‌తో 425 పరుగులు చేశాడు. అతను కూడా 3 మ్యాచ్‌లాడాల్సి ఉంది. ఇదే సగటును కొనసాగిస్తే అతను 680 పరుగులు చేయవచ్చు. ఆరోన్ ఫించ్, జోరూట్‌లు కూడా సచిన్ రికార్డు అధిగమించే రేసులో ఉన్నారు. ఇక భారత ఆటగాడు రోహిత్ శర్మ 106 పరుగుల సగటుతో 319 పరుగుల చేశాడు. రోహిత్ కనుక ఇదే ఫామ్ కొనసాగిస్తే 800 పైగా పరుగులు చేయనున్నాడు. ఇదే జరిగితే సచిన్ రికార్డు బ్రేక్ అవ్వడం ఏమో కానీ.. రోహిత్‌ను భవిష్యత్తులో మరెవరూ అందుకోలేరు. పైగా రోహిత్‌కు ఇంకా ఐదు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. -
ఆ బంతి అత్యద్భుతం : కోహ్లి
మాంచెస్టర్ : పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజంను కుల్దీప్యాదవ్ ఔట్ చేసిన బంతి అత్యుద్భుతమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. బాబర్, ఫకార్ మ్యాచ్ తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించారని, కానీ కుల్దీప్ ఈ జోడిని అద్భుతంగా విడగొట్టాడని కితాబిచ్చాడు. రోహిత్ శర్మ ఇన్నింగ్స్ కూడా అత్యద్భుతమని కొనియాడాడు. ఆదివారం పాక్‌తో జరిగిన పోరులో భారత్ 89 పరుగుల (డక్‌వర్త్–లూయిస్ ప్రకారం) తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘మా ఇన్నింగ్స్ సగం పూర్తయ్యాక బంతి స్పిన్ తిరగడం మొదలైంది. టాస్ గెలిస్తే బౌలింగే తీసుకునేవాళ్లం. రోహిత్ మరోసారి అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ ఉత్తమ వన్డే ఆటగాడినని చాటాడు. బాబర్ ఆజమ్‌ను ఔట్ చేసిన కుల్దీప్ బంతి అద్భుతం. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మనల్ని ఓడించారని... ఈ మ్యాచ్‌ను అతి భావోద్వేగంతో తీసుకుంటే చేదు ఫలితం రావొచ్చు. అందుకని ఆ ఓటమి గురించి ఆలోచించలేదు. ఆటలో ఇలాంటివి భాగమని భావించి ముందుకెళ్లాం. దానికి తగ్గ ఫలితమే ఇది. తొడకండరాలు పట్టేయడంతో భువనేశ్వర్ రెండు, లేదా మూడు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. కానీ కీలక సమయంలో అందుబాటులోకి వస్తాడు’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. క్రెడిట్ భారత బ్యాట్స్‌మెన్‌దే.. టాస్ గెలిచి కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ క్రెడిట్ అంతా భారత బ్యాట్స్‌మెన్‌దేనని చెప్పుకొచ్చాడు. ‘ టాస్ గెలిచాం. కానీ సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయాం. రోహిత్ అద్భుతంగా ఆడాడు. రోహిత్‌కు బాల్ అప్ ప్రణాళిక రచించామని కానీ అది అంతగా పనిచేయలేదు. టాస్ గెలిచిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. భారత్ బ్యాటింగ్, బౌలింగ్‌తో సమిష్టిగా రాణించింది. మూడు ఓవర్ల వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోయాం. ఇదే మా కొంప ముంచింది. ఫకార్, ఇమామ్ అద్భుతంగా ఆడారు. కానీ దాన్ని అందుపుచ్చుకోలేకపోయాం. ప్రస్తుత పరిస్థితులు మాకు కఠినమే. మేం మిగిలిన అన్ని మ్యాచ్‌లు గెలవాలి’ అని తెలిపాడు. -
కెరీర్ ఉత్తమ ర్యాంక్‌కు రోహిత్
దుబాయ్: ఆసియా కప్‌లో అదరగొట్టిన భారత ఓపెనర్లు తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దూకుడు కనబరిచారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీలో జట్టుకు నాయకత్వం వహించి కప్ అందించిన రోహిత్ శర్మ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగు పరుచుకొని తన కెరీర్లో అత్యుత్తమంగా రెండో స్థానానికి చేరాడు. ఈ టోర్నీలో 342 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన మరో ఓపెనర్ శిఖర్ ధావన్ నాలుగు స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంక్‌లో నిలిచాడు. కోహ్లి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల విభాగంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు ఎగబాకి కెరీర్లో తొలిసారి అత్యుత్తమంగా మూడో స్థానానికి వచ్చాడు. అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరాడు. -
కోల్‌కతా టెస్ట్‌లో అశ్విన్ సెంచరీ
-
కోల్‌కతా టెస్ట్‌లో అశ్విన్ సెంచరీ
కోల్‌కతా : కోల్‌కతా టెస్ట్‌లో యువ స్పిన్నర్, టీమిండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ చేశాడు. 159 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో అశ్విన్‌కు ఇది రెండో సెంచరీ. విండీస్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి టెస్టులో నిన్న రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 102 ఓవర్లలో 6 వికెట్లకు 354 పరుగులు చేసింది. మూడోరోజు ఆట ప్రారంభించిన భారత్ జట్టు ఆ దూకుడును కొనసాగిస్తోంది. 92 పరుగులతో అజేయంగా నిలిచిన అశ్విన్ శుక్రవారం ఉదయం ఓ బౌండరీ నాలుగు సింగిల్స్‌తో హండ్రెడ్ మైలురాయిని చేరుకున్నాడు. విండీస్ బౌలర్ టీనో బెస్ట్ వేసిన బాల్‌ను అశ్విన్ స్వీపర్ కవర్ వైపు తరలించి తీసిన సింగిల్‌తో అశ్విన్ తన కెరీర్లో రెండో సెంచరీని కంప్లీట్ చేశాడు. రెండేళ్ల క్రితం వెస్టిండీస్ మీద ముంబైలో 103 పరుగులు చేసిన అశ్విన్‌కు కెరీర్లో ఇది హయ్యెస్ట్ స్కోరు. సెంచరీ నేపథ్యంలో అశ్విన్ పిడికిలి బిగించి చేతిని గాల్లోకి విసిరి తన ఆనందాన్ని చాటాడు . ఈ సెంచరీలో 11 ఫోర్లే వుండటం స్ట్రయికింగ్ రొటేషన్‌కు అశ్విన్ ప్రయారిటీ ఇచ్చినట్టు వెల్లడైంది. ఇప్పటికే సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ .....150 పరుగులు పూర్తి చేసి డబుల్ సెంచరీ దిశగా ఆడుతున్నాడు. వీరిద్దరూ 250 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు.