సాక్షి, ముంబై : మరికొద్ది గంటల్లో క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదరుచూస్తున్న ఐపీఎల్ మహాసంగ్రామం ప్రారంభం కానుంది. రెండు బలమైన జట్లు ముంబై-ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మద్య హోరాహోరీ పోరు జరగనుంది. ఇప్పటి వరకూ చెన్నైపై ముంబై కెప్టెన్ రోహిత్ ప్రదర్శన పేలవంగా ఉందని అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. నేటి మ్యాచ్‌లోనైనా రోహిత్ మెరుస్తాడా? అభిమానుల అంచనాలు అందుకుంటాడా? ధోని జట్టుపై రోహిత్ రికార్డు ఏంటీ?
- ఇప్పటి వరకూ రెండు జట్ల మద్య జరిగిన పోటాపోటీల్లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, చైన్నై సూపర్ కింగ్స్‌పై రెండో అత్యధిక పరుగులు(535) నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. విరాట్ కోహ్లీ (706) పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు.
- ఐపీఎల్ కెరీర్‌లో 159 మ్యాచ్‌ల్లో 4207 పరుగులు చేసిన రోహిత్ 32.61 సగటు, 130.89 స్ట్రైక్ రేటు నమోదు చేశారు.
- చెన్నైతో జరిగిన మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ 535 పరుగులు చేశారు. సగటు 28.15, స్ట్రైక్ రేట్ 124.12 నమోదు చేశారు.
- ఐపీఎల్‌లో నమోదు చేసిన సగటు(32.61) కంటే చెన్నైపై(28.15) రోహిత్ సగటు తక్కువగా ఉంది. స్ట్రైక్ రేట్ కూడా తక్కువగానే ఉంది.
- వాంఖడేలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆరుమ్యాచ్‌ల్లో తలపడిన రోహిత్ శర్మ 54.80 సగటుతో 274 పరుగులు చేశారు
- ఆరు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ నాలుగుసార్లు 30పరుగులు పైగా నమోదు చేశారు. వీటిలో మూడు అర్థసెంచరీలు ఉన్నాయి.
- సీఎస్‌కేపై రెండో వ్యక్తిగత అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు. 2011లో 84 పరుగులు చేశారు. 2008లో జయసూర్య 114 పరుగులతో చెన్నైపై చెలరేగారు.
- ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లు ఐపీఎల్, ఛాంపియన్ లీగ్ టీ20ల్లో 24 సార్లు తలపడగా ముంబై 13 మ్యాచ్‌లు, చెన్నై 11 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.
- ముంబై చెన్నైలు 2015 మే 24న ఐపీఎల్ ఫైనల్లో చివరిసారి తలపడ్డాయి. ఈమ్యాచ్‌లో ముంబై 41 పరుగుల తేడాతో గెలిచి కప్‌ను ఎగరేసుకుపోయింది.
Comments
Please login to add a commentAdd a comment