
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు
బెంగళూరు: ఐపీఎల్-8లో భాగంగా ఆదివారం సాయంత్రం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరగనున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ప్లే ఆఫ్ కు చేరాలంటే బెంగళూరుకు ఈ మ్యాచ్ చాలా కీలకం. లీగ్ దశలో ఇరు జట్లకు ఇదే చివరి మ్యాచ్. బెంగళూరు ఖాతాలో 15 పాయింట్లుండగా, ఢిల్లీ ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి.