సచిన్ టెండూల్కర్
ముంబై : టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్స్ వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్‌లు కలిసి ఎన్నో విజయాలు అందించారు. వస్తూనే తనదైన శైలిలో సెహ్వాగ్ బౌలర్లపై విరుచుకు పడుతుంటే మరో ఎండ్‌లో సచిన్ ఆచితూచి ఆడేవాడు. వీరీ బ్యాటింగ్ అందరూ ఆస్వాదించేవారు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన తొలి రోజుల్లో సెహ్వాగ్ చాలా సిగ్గు పడేవాడని సచిన్ తెలిపాడు . ఓ వెబ్ షో కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
‘సెహ్వాగ్ ఇప్పుడైతే చలాకీగా.. మాటల తూటాలు పేలుస్తున్నాడు. కానీ కెరీర్ ప్రారంభంలో చాలా సైలెంట్‌గా ఉండేవాడు. నాతో కూడా మాట్లాడేవాడు కాదు. ఇద్దరం కలిసి బ్యాటింగ్ చేయాలి. బాగా రాణించాలంటే మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండాలని భావించాను. సెహ్వాగ్ నాతో అనువుగా ఉండేటట్లు చేసుకోవాలి అనుకుని ఒకరోజు కలిసి భోజనం చేద్దామా అని అడిగాను. అంతకు ముందు తనకేం ఇష్టమని అడిగాను. అతను వెంటనే నేను శాకాహారిని అని తెలిపాడు. ఎందుకు అని ప్రశ్నించగా.. చికెన్ తింటే లావు అవుతారని వారింట్లో చెప్పారని బదులిచ్చాడు.’ అని సచిన్ నవ్వుతూ ఆ ఘటనను గుర్తు చేసుకున్నాడు.
93 అంతర్జాతీయ వన్డేల్లో సచిన్, సెహ్వాగ్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగి 42.13 సగటుతో 3,919 పరుగులు చేశారు. 12 సెంచరీ, 15 హాఫ్ సెంచరీల భాగస్వామ్యాలు నెలకొల్పారు. దీంతో అత్యధిక భాగస్వామ్యాలు నెలకొల్పిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment