సచిన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎస్‌ఆర్‌టీ స్పోర్ట్స్ పేరుతో సొంత స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రారంభించారు. ఈ కంపెనీ సచిన్ ఎండార్స్‌మెంట్స్‌తో పాటు ఐఎస్‌ఎల్ ఫుట్‌బాల్‌లో కేరళ బ్లాస్టర్స్‌కు సంబంధించిన వ్యవహారాలను కూడా చూస్తుంది. గతంలో సచిన్‌కు సంబంధించిన వ్యవహారాలను బయటి కంపెనీ చూసుకునేది. ఇటీవల కాలంలో అనేక వ్యాపారాలలోకి సచిన్ అడుగుపెడుతున్నందున ఈ సొంత కంపెనీని ఏర్పాటు చేశారు.