విరాట్ టెక్నిక్‌పై రాజీపడడు: సచిన్ | Sachin Tendulkar praises special talent virat kholi and his straight bat | Sakshi
Sakshi News home page

విరాట్ టెక్నిక్‌పై రాజీపడడు: సచిన్

Published Sat, May 28 2016 1:05 AM | Last Updated on Mon, Sep 4 2017 1:04 AM

విరాట్ టెక్నిక్‌పై  రాజీపడడు: సచిన్

విరాట్ టెక్నిక్‌పై రాజీపడడు: సచిన్

 ఐపీఎల్‌లో పోటీతత్వం పెరిగింది
 
దుబాయ్: టెక్నిక్‌పై రాజీపడకపోవడం, స్ట్రయిట్ బ్యాట్‌తో ఆడటం వల్లే భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి విజయవంతమవుతున్నాడని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ‘కోహ్లి స్ట్రయిట్ బ్యాట్‌తో మంచి క్రికెటింగ్ షాట్స్ ఆడతాడు. అతనిలో ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది. ఆట కోసం చాలా కష్టపడతాడు. అతని క్రమశిక్షణ, అంకితభావం అమోఘం.

టెక్నిక్‌పై రాజీపడకుండా మూడు ఫార్మాట్ల గురించి ఆలోచిస్తాడు. దీనికి అదనంగా మానసికంగా చాలా ధృడంగా ఉన్నాడు. కఠిన పరిస్థితులను చాలా బాగా అధిగమిస్తాడు’ అని సచిన్ పేర్కొన్నాడు.

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement