ఆ శతకం... కెరీర్‌ను మార్చేసింది | Sachin Tendulkar reckons ton in Perth shaped his career | Sakshi
Sakshi News home page

ఆ శతకం... కెరీర్‌ను మార్చేసింది

Published Thu, Jul 24 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM

ఆ శతకం... కెరీర్‌ను మార్చేసింది

ఆ శతకం... కెరీర్‌ను మార్చేసింది

పెర్త్ ఇన్నింగ్స్‌పై సచిన్ వ్యాఖ్య
 ముంబై: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, బౌన్సీ వికెట్... ఆపై నిప్పులు చెరిగే ఆస్ట్రేలియా పేసర్లు.. బంతిని ముట్టుకోవాలంటే.. ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి వాకా పిచ్‌పై 1992లో చేసిన సెంచరీ తన కెరీర్‌ను పూర్తిగా మార్చేసిందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు. ఆ ఇన్నింగ్స్ తనలో ఎనలేని విశ్వాసాన్ని నింపిందన్నాడు. ‘పెర్త్ ఇన్నింగ్స్ నా కెరీర్‌కు ఓ రూపు తెచ్చింది. బౌన్సీ పిచ్‌పై ఆసీస్ పేసర్లను ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉండేది.

అప్పుడు నా వయసు 19 ఏళ్లు... అయినా సెంచరీ కొట్టా. దాని కంటే రెండు మ్యాచ్‌ల ముందు సిడ్నీలో శతకం చేశా. అయితే ఈ రెండు పిచ్‌లకు చాలా తేడాలున్నాయి. పెర్త్‌లాంటి వికెట్ ప్రపంచంలో ఎక్కడా లభించదు. అలాంటి పిచ్‌పై పరుగులు చేస్తే ప్రపంచంలోని బౌన్సీ, ఫాస్ట్ వికెట్లపై సులువుగా రన్స్ చేయొచ్చు. అప్పుడప్పుడే ప్రారంభమైన నా కెరీర్ పెర్త్ ఇన్నింగ్స్ తర్వాత వేగం పుంజుకుంది’ అని ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ పేర్కొన్నాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement