Rohit Sharma On Brink Of History, Set To Beat Sachin Tendulkar To Elite Milestone - Sakshi
Sakshi News home page

IND vs WI: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్‌ శర్మ.. అలా అయితే సచిన్‌, గంగూలీ!

Published Thu, Jul 27 2023 11:29 AM | Last Updated on Thu, Jul 27 2023 11:47 AM

Rohit Sharma On Brink Of History - Sakshi

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ సిరీస్‌లో రోహిత్‌ మరో 175 పరుగులు సాధిస్తే.. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో క్రికెటర్‌గా నిలుస్తాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ,రికీ పాంటింగ్‌, జాక్వాస్‌ కల్లిస్‌, ధోని వంటి దిగ్గజ క్రికెటర్లను రోహిత్‌ అధిగమిస్తాడు.

ఇప్పటి వర​కు 236 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడిన హిట్‌మ్యాన్‌ 9825 పరుగులు చేశాడు. రోహిత్‌ వన్డే కెరీర్‌లో  30 సెంచరీలు, 48 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఈ ఘనత సాధించిన జాబితాలో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి అగ్రస్ధానంలో ఉన్నాడు. ​కోహ్లి కేవలం 205 ఇ‍న్నింగ్స్‌లలోనే అందుకున్నాడు. ప్రస్తుతం కోహ్లి తర్వాత స్ధానంలో సచిన్ టెండూల్కర్(259 ఇన్నింగ్స్‌లు) ఉన్నాడు.

ఇక మూడు వన్డే సిరీస్‌లో భాగంగా విండీస్‌-భారత్‌ మధ్య తొలి వన్డే గురువారం బార్బడస్‌ వేదికగా జరగనుంది. సాయంత్రం 7:00 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. కాగా తొలి వన్డేకు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్‌ జరిగే బార్బడస్‌లో గురువారం భారీ వర్షం కురిసే ఛాన్స్‌ ఉందని అక్కడి వాతవారణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా వర్షం కారణంగా భారత్‌-విండీస్‌ రెండో టెస్టు ఆఖరి రోజు ఆట పూర్తిగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసే అవకాశాన్ని భారత్‌ కోల్పోయింది.

వన్డేల్లో అత్యంత వేగంగా 10వేల పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
విరాట్ కోహ్లి: (205 ఇన్నింగ్స్‌లు)
సచిన్ టెండూల్కర్:(259 ఇన్నింగ్స్‌లు)
సౌరవ్ గంగూలీ: (263 ఇన్నింగ్స్‌లు)
రికీ పాంటింగ్: (266 ఇన్నింగ్స్‌లు)
జాక్వెస్ కల్లిస్: (272 ఇన్నింగ్స్‌లు)
ఎంఎస్ ధోని: (273 ఇన్నింగ్స్‌లు)
రాహుల్ ద్రవిడ్: (287 ఇన్నింగ్స్‌లు)

తొలి వన్డేకు తుది జట్లు(అంచనా)
భారత్‌: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్ధూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ , సిరాజ్‌

విండీస్‌: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, కీసీ కార్టీ, షాయ్ హోప్ (కెప్టెన్‌), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, కెవిన్ సింక్లైర్, అల్జారీ జోసెఫ్, ఒషానే థామస్, జేడెన్ సీల్స్
చదవండి:
 IND vs WI: వెస్టిండీస్‌తో తొలి వన్డే.. టీమిండియా అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement