వెస్టిండీస్‌తో సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా మంగళవారం సాయంత్రం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం..) మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్ 1-1 సమంగా ఉండటంతో ఈ మ్యాచ్‌పై సర్వాత్ర ఆసక్తి నెలకొంది. గత రెండు వన్డేల్లో బ్యాటింగ్ విభాగంలో ప్రయోగాలు చేసిన భారత్ మిశ్రమ ఫలితాలను సాధించింది. తొలి వన్డేలో కష్టపడి విజయం సాధించిన భారత్.. రెండో వన్డేలో మాత్రం ఘోర పరాజాయం పాలైంది.
ఈ మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి జట్టు మెన్‌జ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. అందుకు తగ్గ మూల్యం టీమిండియా చెల్లించుకుంది. ఈ క్రమంలో కీలకమైన మూడో వన్డేలో ఎటువంటి ప్రయోగాలు చేయకుండా పూర్తి స్దాయి జట్టునే ఆడించాలని జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు విజయనాందంలో ఉన్న కరేబియన్ జట్టు.. అదే జోరును మూడో వన్డేలో కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది.
పిచ్ రిపోర్ట్
బ్రియాన్ లారా స్టేడియంలోని పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. వికెట్ కొంచెం స్లోగా ఉంటుంది. కాబట్టి బ్యాటర్లు ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు ఈ స్టేడియంలో ఒకే ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మైదానంలో పురుషల క్రికెట్‌లో ఇదే తొలి అంతర్జాతీయ వన్డే. అయితే ఇప్పటివరకు మూడు మహిళలల వన్డే మ్యాచ్‌లు జరిగాయి.కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా 200 పరుగుల స్కోర్ నమోదు కాలేదు.
వరుణుడు కరుణించేనా?
ఇక ఈ కీలక మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ట్రినిడాడ్‌లో మ్యాచ్‌లో జరిగే సమయంలో ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఆక్యూవెధర్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. ఆక్యూవెధర్ ప్రకారం.. వర్షం పడటానికి 50 శాతం ఆస్కారం ఉంది. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైనట్లైతే ఇరు జట్లు ట్రోఫీని సంయుక్తంగా పంచుకుంటాయి.
చదవండి: IND Vs WI: టీమిండియాతో టీ20 సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! సిక్సర్ల వీరుడు వచ్చేశాడు
Comments
Please login to add a commentAdd a comment