వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజ ఆటగాడు వీవి రిచర్డ్స్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. రిచర్డ్స్ 1952 మార్చి 07న జన్మించాడు. ఈ సందర్భంగా సచిన్ తన ట్వీటర్ అకౌంట్‌లో అతనితో కలిసి దిగిన ఫొటోను పోస్టు చేశాడు. ‘నా బ్యాటింగ్ హీరోకు జన్మదిన శుభాకాంక్షలు’ అని పోస్టు చేశాడు.
రిచర్డ్స్ విధ్వంకర బ్యాట్స్‌మెన్‌గా పేరు పొందిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ జట్టుకు చాలా సంవత్సరాలు తన సేవలు అందించాడు రిచర్డ్స్. బ్యాటింగ్‌తో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆయన రాబోయే తరాల వారికి స్పూర్తిగా నిలిచాడు. వెస్టిండీస్ జట్టులో బౌలర్ల హవా కొనసాగుతున్న రోజుల్లో కూడా రిచర్డ్స్ బ్యాటింగ్‌తో అభిమానులను సంపాదించుకున్నాడు.
రిచర్డ్స్ తన క్రికెట్ కెరీర్‌ను 1974 నవంబర్ 22న ఇండియాతో టెస్టు మ్యాచ్‌తో ప్రారంభించాడు. తన చివరి టెస్టు మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌తో 1991 ఆగస్టు 8న ఆడాడు. 1975లో వన్డేలలో ఆరంగ్రేటం చేశాడు. రిచర్డ్స్ 1984–1991 కరేబియన్ జట్టుకు కెప్టెన్సీ భాద్యతలు చేపట్టాడు. రిచర్డ్ష్ మొత్తం 121 టెస్టు మ్యాచ్‌లు ఆడి 8,540 పరుగులు సాధించాడు. వెస్టిండీస్1975, 79 వరల్డ్ కప్ సాధించడంలో రిచర్డ్స్ కీలకపాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment