విరాట్ కోహ్లి
ముంబై : ఇంగ్లండ్ పర్యటనలో దుమ్మురేపుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. తొలి టెస్టులో తృటిలో విజయం చేజారినా.. కోహ్లి పోరాటం ఆకట్టుకుందని కొనియాడాడు. కోహ్లికి తనిచ్చే సలహా తన దూకుడును ఇలానే కొనసాగించాలని చెప్పడమేనని సచిన్ ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోకు తెలిపాడు. (ఇంగ్లండ్ టూర్ ఆటకోసమా? హనీమూన్ కోసమా?)
‘కోహ్లి తన బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తున్నాడు. ఇది ఇలానే కొనసాగించాలి. తన చుట్టు ఏం జరుగుతుందో అనేది తనకనవసరం. తన లక్ష్యంపేనే నీ దృష్టి సారించాలి. అతని మనస్సుకు అనిపించింది చేసుకుంటూ ముందుకు సాగాలి. గత పర్యటన పరాభవం గురించి ఆలోచించాల్సిన అవసరం తనకు లేదని’ సూచించాడు. కోహ్లి పరుగుల కోసం పరితపిస్తున్నాడా అని ప్రశ్నించగా.. ‘నా అనుభవం ప్రకారం ప్రతి బ్యాట్స్‌మన్‌కు పరుగుల చేయాలనే ఉంటుంది. ఈ విషయంలో వారికి హద్దులుండవు. ఎన్ని పరుగులు చేసిన సంతృప్తి చెందరు. బౌలర్లు 10 వికెట్లు తీస్తే సంతోషిస్తారు. కానీ బ్యాట్స్‌మన్ అలా కాదు. పరుగులు చేస్తున్నా కొద్దీ ఇంకా ఇంకా చేయాలనిపిస్తోంది. కోహ్లి విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఇప్పటికే అతను చాలా సాధించాడు. అయినప్పటికీ అవి అతనికి సరిపోవు.’ అని సచిన్ పేర్కొన్నాడు.ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఓడిన కోహ్లి సేన రెండో టెస్టుకు సిద్దమైంది. లార్డ్స్ వేదికగా రేపటి (గురువారం) నుంచి రెండో టెస్టు ప్రారంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment