రన్నరప్‌ సాయిదేదీప్య | saidedeepya as runnerup in all india tennis tourney | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ సాయిదేదీప్య

Published Sat, Oct 21 2017 10:52 AM | Last Updated on Sat, Oct 21 2017 10:57 AM

saidedeepya as runnerup in all india tennis tourney

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ–ఐటా) టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి వై. సాయిదేదీప్య ఆకట్టుకుంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఈ టోర్నీలో సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో దేదీప్య 6–2, 5–7, 6–7 (5/7)తో హిమాని మోర్‌ (హరియాణా) చేతిలో పరాజయం పాలైంది. డబుల్స్‌ టైటిల్‌ పోరులో సాయిదేదీప్య–ఆర్తి (తమిళనాడు) జంట 3–6, 6–3, 8–10తో హిమాని (హరియాణా)–దక్షిత (మహారాష్ట్ర) జోడీ చేతిలో ఓడిపోయింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement