థామస్, ఉబెర్ కప్‌లకు భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: థామస్, ఉబెర్‌కప్‌లలో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్లకు శ్రీకాంత్, సైనా నెహ్వాల్ సారథ్యం వహిస్తారు. ఈ నెల 18 నుంచి 25 వరకు ఢిల్లీలోని సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక టోర్నీలకు భారత బ్యాడ్మింటన్ సంఘం(బాయ్) జట్టును ప్రకటించింది. ప్రపంచ ర్యాంకుల ఆధారంగా జట్టును ఎంపిక చేశారు.
పురుషుల జట్టు: శ్రీకాంత్, కశ్యప్, గురు సాయిదత్, సౌరభ్ వర్మ, సాయి ప్రణీత్ (సింగిల్స్), ప్రణవ్, అక్ష య్, ఆత్రి, అరుణ్ విష్ణు, సుమీత్ రెడ్డి(డబుల్స్).
మహిళల జట్టు: సైనా, సింధు, అరుంధతి, తన్వీలాడ్, తులసి (సింగిల్స్), జ్వాల, అశ్విని, అపర్ణ, సిక్కిరెడ్డి, ప్రద్న్యా గాద్రె (డబుల్స్)
శ్రీకాంత్, సైనాలకు సారథ్యం
Published Thu, May 8 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM
Advertisement
Advertisement