క్వార్టర్స్ కు సైనా, శ్రీకాంత్ | Saina Nehwal, Kidambi Srikanth Sail Into Quarters of Australian Open | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్ కు సైనా, శ్రీకాంత్

Published Thu, Jun 9 2016 5:50 PM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

Saina Nehwal, Kidambi Srikanth Sail Into Quarters of Australian Open

సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్లు క్వార్టర్స్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల పోరులో  ఏడో సీడ్ సైనా నెహ్వాల్ 21-12,21-14 తేడాతో జిన్ వుయ్ గో(మలేషియా)పై గెలిచి క్వార్టర్స్ చేరగా, పురుషుల పోరులో కిడాంబి శ్రీకాంత్ 21-19, 21-12 తేడాతో సోనో ద్వి కున్కురో(ఇండోనేషియా)పై విజయం సాధించి క్వార్టర్స్లోకి ప్రవేశించాడు.
 

మహిళల సింగిల్స్ లో భాగంగా తొలి గేమ్ను అవలీలగా గెలుచుకున్న సైనా.. అదే ఊపును రెండో గేమ్లో కూడా కొనసాగించి విజయం సాధించింది.  సైనాకు ఏదశలోనూ పోటీనివ్వని మలేషియా క్రీడాకారిణి ఓటమితో టోర్నీ నుంచి నిష్ర్కమించింది.  ఇదిలా ఉండగా పురుషుల సింగిల్స్ తొలి గేమ్ లో శ్రీకాంత్ కు ద్వి కున్కురో నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే తీవ్రంగా పోరాడిన శ్రీకాంత్ తొలి గేమ్ను దక్కించుకున్నాడు.  అనంతరం రెండో గేమ్ లో పూర్తి ఆత్మవిశ్వాసం కనబరిచిన శ్రీకాంత్ ఆది నుంచి పైచేయి సాధించి ఆ గేమ్ ను సొంతం చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement