వరల్డ్‌ నంబర్‌ 4కు షాకిచ్చిన శ్రీకాంత్.. సైనా, లక్ష్యసేన్‌ ఔట్‌ | Japan Open 2022: Srikanth Stuns World Number Four, Saina, Lakshya Sen Crash Out | Sakshi
Sakshi News home page

Japan Open 2022: తొలి రౌండ్‌లో భారత్‌కు నిరాశజనక ఫలితాలు

Published Wed, Aug 31 2022 7:55 PM | Last Updated on Wed, Aug 31 2022 7:55 PM

Japan Open 2022: Srikanth Stuns World Number Four, Saina, Lakshya Sen Crash Out - Sakshi

జపాన్ ఓపెన్ 2022లో బుధవారం భారత షట్లర్లకు నిరాశజనక ఫలితాలు వచ్చాయి. తొలి రౌండ్‌లో స్టార్ షట్లర్లు లక్ష్యసేన్, సైనా నెహ్వాల్ ఇంటిబాట పట్టగా, కిదాంబి శ్రీకాంత్.. వరల్డ్‌ నంబర్‌ 4 ఆటగాడికి షాకిచ్చి ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. మరోవైపు పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ భారత్‌కు చుక్కెదురైంది. బుధవారం శ్రీకాంత్‌ ఒక్కడే తొలి రౌండ్‌ గండాన్ని అధిగమించాడు. శ్రీకాంత్.. మలేషియాకు చెందిన లి జి జియా ను 22-20, 23-21 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. గత కొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న శ్రీకాంత్‌.. ఈ గేమ్‌లో ఆత్మవిశ్వాసంతో ఆడాడు. 

మిగతా గేమ్‌ల్లో లక్ష్యసేన్.. జపాన్‌కు చెందిన కెంట నిషిమొటొ చేతిలో 21-18, 14-21, 13-21 తేడాతో, సైనా నెహ్వాల్.. జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచి చేతిలో 21-9, 21-17 తేడాతో ఓడారు. పురుషుల డబుల్స్‌లో అర్జున్-కపిల ద్వయం.. చోయ్-కిమ్ చేతిలో, మహిళల డబుల్స్‌లో జాలీ-గాయత్రి గోపీచంద్ జోడీ.. కిటితరకుల్-ప్రజోంగజ్ చేతిలో, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ప్రసాద్-దేవాంగన్ జంట.. జెంగ్-హుయాంగ్ చేతిలో ఓటమి చవిచూశాయి. కాగా, ఈ టోర్నీలో మంగళవారం హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. 
చదవండి: యూఎస్‌ ఓపెన్‌లో సంచలనం.. డిఫెండింగ్ చాంపియన్‌కు బిగ్‌షాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement