
సాక్షి, సిటీబ్యూరో :భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌ల వివాహ రిసెప్షన్ ఆదివారం హెచ్‌ఐసీసీలో వైభవంగాజరిగింది. పలువురు క్రీడా, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించారు. భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌ల రిసెప్షన్‌ఆదివారం హెచ్‌ఐసీసీలో అంగరంగ వైభవంగా జరిగింది. రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులు తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. హోంమంత్రి మహమూద్ అలీ, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ కవిత, గుత్తాజ్వాల, హీరోయిన్లు రకుల్‌ప్రీత్ సింగ్, మంచు లక్ష్మితదితరులు హాజరయ్యారు.