విజేత సెయింట్ జోసెఫ్ స్కూల్ | saint joseph school won volley ball title | Sakshi
Sakshi News home page

విజేత సెయింట్ జోసెఫ్ స్కూల్

Published Sun, Aug 21 2016 12:18 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

saint joseph school won volley ball title

సాక్షి, హైదరాబాద్: ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ బాలికల వాలీబాల్ టోర్నమెంట్‌లో సెయింట్ జోసెఫ్, షేర్‌వుడ్ స్కూల్స్ విజేతలుగా నిలిచాయి. బషీర్‌బాగ్‌లోని షేర్‌వుడ్ పబ్లిక్ స్కూల్‌లో శనివారం జరిగిన జూనియర్ బాలికల ఫైనల్లో సెయింట్ జోసెఫ్ (మలక్‌పేట) స్కూల్ 25-26, 25-11తో సెయింట్ జోసెఫ్ (హబ్సిగూడ) స్కూల్‌పై గెలుపొందగా... సీనియర్ బాలికల ఫైనల్లో షేర్‌వుడ్ పబ్లిక్ స్కూల్ 25-14, 25-20తో అభ్యాస స్కూల్‌ను ఓడించింది.

 

అంతకు ముందు జరిగిన జూనియర్ బాలికల సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో సెయింట్ జోసెఫ్ (మలక్‌పేట) స్కూల్ 25-16, 25-16తో సెయింట్ ఆన్స్ స్కూల్‌పై, సెయింట్ జోసెఫ్ (హబ్సిగూడ) 18-25, 25-18, 17-15తో షేర్‌వుడ్ పబ్లిక్ స్కూల్‌పై విజయం సాధించాయి. సీనియర్ బాలికల సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో షేర్‌వుడ్ పబ్లిక్ స్కూల్ 25-22, 25-21తో సెయింట్ జోసెఫ్ (కింగ్‌కోఠి) స్కూల్‌పై, అభ్యాస స్కూల్ 25-22, 25-11తో ఎన్‌ఏఎస్‌ఆర్ స్కూల్స్‌పై గెలుపొందాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement