ప్రత్యేక విమానం కావాలనడం సబబే: సానియా | Sania Mirza counters MP government's charges | Sakshi
Sakshi News home page

ప్రత్యేక విమానం కావాలనడం సబబే: సానియా

Published Thu, Dec 3 2015 3:47 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

ప్రత్యేక విమానం కావాలనడం సబబే: సానియా - Sakshi

ప్రత్యేక విమానం కావాలనడం సబబే: సానియా

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తోసిపుచ్చారు.  మధ్యప్రదేశ్ వార్షిక క్రీడా అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంతోపాటు, మేకప్ కిట్ కోసం రూ. 75 వేలు ఇవ్వాలని తాను డిమాండ్ చేసినట్టు వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. ఈ వేడుకకు వచ్చేందుకు భోపాల్ వరకు ప్రత్యేక విమానం ఏర్పాటుచేయాలని కోరిన విషయం వాస్తవమేనని సానియా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

రావడానికి ప్రత్యేక విమానం, రూ. 75 వేలు మేకప్ కిట్ కోసం కోరడంతో సానియాను పక్కనబెట్టి.. పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం వేడుకను నిర్వహించింది. గత నెల 28న జరుగాల్సిన వేడుకను సానియా రాకపోవడంతో మొన్నటి శనివారం నిర్వహించింది. ఈ ప్రదానోత్సవంలో మధ్యప్రదేశ్ క్రీడామంత్రి యశోధర మాట్లాడుతూ సానియా డిమాండ్లు సరికావని పేర్కొన్నారు. ఈ వివాదంపై సానియా మేనేజింగ్ ఏజెన్సీ క్వాన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

'ఆ వేడుకలో సానియా పాల్గొనేందుకు ఆసక్తి కనబర్చారు. దీంతో సంబంధిత వ్యక్తులతో మేం ప్రత్యక్షంగా సంప్రదింపులు జరిపాం' అని క్వాన్ ఏజెన్సీ తెలిపింది. సానియా భోపాల్ వచ్చేందుకు ప్రత్యేక విమానం కావాలని కోరిన సంగతి వాస్తవమేనని, అయితే ఆమె వేడుకలో పాల్గొనేందుకు రూ. 5 లక్షలు డిమాండ్ చేసినట్టు వార్తలు అవాస్తవమని చెప్పారు.  మధ్యప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం అక్టోబర్ 28న ఉండటం, ఆ తెల్లారి గోవాలో మరో కార్యక్రమానికి ఆమె హాజరుకావాల్సి ఉండటం.. గోవా నుంచి భోపాల్ కు కమర్షియల్ విమానంలో వెళితే ఏడు గంటల సమయం పడుతుండటంతో ప్రత్యేక విమానాన్ని సమకూర్చాలని కోరామని, అంతేకాని మరో ఉద్దేశంతో కాదని క్వాన్ ఏజెన్సీ వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement