సానియాకు మరో రూ. కోటి | sania mirza to receive rs 1 crore from telangana government again | Sakshi
Sakshi News home page

సానియాకు మరో రూ. కోటి

Published Fri, Sep 12 2014 2:02 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

సానియాకు మరో రూ. కోటి - Sakshi

సానియాకు మరో రూ. కోటి

తెలంగాణ ప్రభుత్వం నజరానా
సాక్షి, హైదరాబాద్: యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రూ.కోటి నజరానా ప్రకటించారు. ఈ టోర్నీ ఆరంభానికి ముందు శిక్షణ కోసం రూ.కోటి ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా టైటిల్ గెలిచిన ఆనందంలో ఉన్న సానియాకు గురువారం సచివాలయంలో ప్రోత్సాహకంగా సీఎం మరోసారి రూ.కోటి చెక్‌ను అందించారు. వచ్చే వారం నుంచి టోక్యోలో జరిగే జపాన్ ఓపెన్, ఆ తర్వాత జరిగే చైనా ఓపెన్ టోర్నమెంట్‌లోనూ సానియా విజయం సాధించాలని ఆయన ఆకాక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన సానియా.. సీఎం కేసీఆర్ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
 
హేమలతకు రూ.25 లక్షలు
2002లో ఆసియా జూనియర్ పవర్ లిఫ్టింగ్‌లో స్వర్ణం గెలిచిన సూర్యవంశీ హేమలతకి తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షల నజరానా ప్రకటించింది. దీంతోపాటు ఆమెకు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.

సానియా జోడికి నాలుగో ర్యాంకు: ఈ ఏడాది చివర్లో జరిగే డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు సానియా అర్హత సాధించేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ టోర్నీకి సంబంధించి సానియా-బ్లాక్ జోడి నాలుగో ర్యాంక్‌లో ఉంది.  2002 అనంతరం తొలిసారి ఈ టోర్నీకి ఎనిమిది డబుల్స్ జోడీలకు ప్రవేశం కల్పించనున్నారు. వచ్చే నెల 17నుంచి జరిగే ఈ టోర్నీకి ఇప్పటికే మూడు డబుల్స్ జోడీలు అర్హత సాధించాయి. ఆసియాలో జరిగే నాలుగు టోర్నీల నుంచి మిగిలిన ఐదు జోడీలు ఎంపికవుతాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement