US Open mixed doubles title
-
సానియాకు మరో రూ. కోటి
తెలంగాణ ప్రభుత్వం నజరానా సాక్షి, హైదరాబాద్: యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రూ.కోటి నజరానా ప్రకటించారు. ఈ టోర్నీ ఆరంభానికి ముందు శిక్షణ కోసం రూ.కోటి ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా టైటిల్ గెలిచిన ఆనందంలో ఉన్న సానియాకు గురువారం సచివాలయంలో ప్రోత్సాహకంగా సీఎం మరోసారి రూ.కోటి చెక్‌ను అందించారు. వచ్చే వారం నుంచి టోక్యోలో జరిగే జపాన్ ఓపెన్, ఆ తర్వాత జరిగే చైనా ఓపెన్ టోర్నమెంట్లోనూ సానియా విజయం సాధించాలని ఆయన ఆకాక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన సానియా.. సీఎం కేసీఆర్ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. హేమలతకు రూ.25 లక్షలు 2002లో ఆసియా జూనియర్ పవర్ లిఫ్టింగ్‌లో స్వర్ణం గెలిచిన సూర్యవంశీ హేమలతకి తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షల నజరానా ప్రకటించింది. దీంతోపాటు ఆమెకు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. సానియా జోడికి నాలుగో ర్యాంకు: ఈ ఏడాది చివర్లో జరిగే డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు సానియా అర్హత సాధించేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ టోర్నీకి సంబంధించి సానియా-బ్లాక్ జోడి నాలుగో ర్యాంక్‌లో ఉంది. 2002 అనంతరం తొలిసారి ఈ టోర్నీకి ఎనిమిది డబుల్స్ జోడీలకు ప్రవేశం కల్పించనున్నారు. వచ్చే నెల 17నుంచి జరిగే ఈ టోర్నీకి ఇప్పటికే మూడు డబుల్స్ జోడీలు అర్హత సాధించాయి. ఆసియాలో జరిగే నాలుగు టోర్నీల నుంచి మిగిలిన ఐదు జోడీలు ఎంపికవుతాయి. -

సానియా మీర్జాకు ఘనస్వాగతం
హైదరాబాద్: యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఘనస్వాగతం లభించింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఆమెకు ఘనస్వాగతం పలికారు. టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు రాణించిన సానియా మీర్జా తన భాగస్వామి బ్రూనో సోరెస్ (బ్రెజిల్)తో కలిసి యూఎస్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా-సోరెస్ ద్వయం 6-1, 2-6, 11-9తో అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా)-శాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో) జంటపై విజయం సాధించింది.డబుల్స్ టైటిల్ సాధించిన సానియా మీర్జాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా అభినందించారు. ఈ విజయం ద్వారా సానియా దేశం గర్వించేలా చేసిందని కొనియాడారు. తన విజయాన్ని భారత దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి, తమ రాష్ట్ర ప్రజానీకానికి అంకితమిస్తున్నానని . సానియా మీర్జా చెప్పింది. గతంలో తనంతట తాను ఎప్పుడూ విజయాలను ఎవరికో అంకితం చేస్తున్నట్లు ఆమె ప్రకటించలేదు. కానీ ఈసారి మాత్రం ప్రత్యేకంగా దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్య చేసింది. దీనికి కారణం ఆమె తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితురాలు కావడమేనని అనుకుంటున్నారు. వింబుల్డన్ మినహా సానియా మిగిలిన మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలోనూ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలిచింది. **