న్యూజిలాండ్-ఆస్ట్రేలియాల రెండో టెస్టు డ్రా | second test of australia and New Zealand Match drawn | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్-ఆస్ట్రేలియాల రెండో టెస్టు డ్రా

Published Tue, Nov 17 2015 3:50 PM | Last Updated on Sun, Sep 3 2017 12:37 PM

న్యూజిలాండ్-ఆస్ట్రేలియాల రెండో టెస్టు డ్రా

న్యూజిలాండ్-ఆస్ట్రేలియాల రెండో టెస్టు డ్రా

పెర్త్: న్యూజిలాండ్-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన రెండో టెస్టు డ్రా ముగిసింది. 258/2 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 385/7 వద్ద డిక్లేర్ చేసింది.  అనంతరం రెండో ఇన్నింగ్స్ చేపట్టిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులతో ఉండటంతో మ్యాచ్  డ్రాగా ముగియక తప్పలేదు.

 

అంతకుముందు ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత్(138), వోజస్(119)లు శతకాలతో రాణించగా, నెవిల్(35), జాన్సన్(29), స్టార్క్(28)లు ఫర్వాలేదనిపించారు.  ఈ మ్యాచ్ లో డబుల్ సెంచరీతో రాణించిన రాస్ టేలర్ కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది. తొలి టెస్టులో గెలిచిన ఆసీస్ 1-0 తో ఆధిక్యంలో ఉంది.  చివరిదైన మూడో టెస్టు అడిలైడ్ లో నవంబర్ 27 నుంచి జరుగనుంది. ఈ మ్యాచ్ ను తొలిసారి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ గా నిర్వహించనున్నారు.

 

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్  559/9 డిక్లేర్, రెండో ఇన్నింగ్స్ 385/7

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 624 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 104/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement