నాల్గో రౌండ్ లోకి నల్ల కలువ | Serena Williams beats Elina Svitolina in Australian Open | Sakshi
Sakshi News home page

నాల్గో రౌండ్ లోకి నల్ల కలువ

Published Sat, Jan 24 2015 9:47 AM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

నాల్గో రౌండ్ లోకి నల్ల కలువ

నాల్గో రౌండ్ లోకి నల్ల కలువ

మెల్ బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ లో టాప్ సీడ్ అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ నాల్గో రౌండ్ లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మూడో రౌండ్ లో సెరెనా 4-6, 6-2, 6-0 తేడాతో ఎలీనా వితోలినాపై విజయం సాధించింది.  తొలి రౌండ్ ను నెమ్మదిగా ఆరంభించిన సెరెనా అనూహ్యంగా మొదటి సెట్ ను కోల్పోయింది. అయితే తరువాత దూకుడు పెంచిన ఈ నల్ల కలువ వరుస రెండు సెట్ లను కైవశం చేసుకుని మూడో రౌండ్ అడ్డంకిని అధిగమించింది. ఓ దశలో సెరెనా విలియమ్స్ సంధించిన ఏస్ లకు ఎలీనా దగ్గర సమాధానం లేకుండా పోయింది.

 

సెరెనా విలియమ్స్  తన తదుపరి రౌండ్ లో ఇరవై నాల్గో సీడ్ గార్బైన్ ముగురుజ్జా తో తలపడనుంది.  అంతకుముందు జరిగిన మూడో రౌండ్ లో సెరెనా 7-5, 6-0తో రష్యా వెటరన్ ప్లేయర్ వెరా జ్వొనరేవాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement