
జోహెన్నెస్‌బర్గ్: టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న చివరదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు స్వల్ప స్కోరుకే పరిమితమైన సంగతి తెలిసిందే. పేస్ బౌలింగ్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ అనుకూలిస్తున్న వాండరర్స్ మైదానంలో టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకే పరిమితమైతే, సఫారీ తమ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకు చాపచుట్టేసింది.
ఆ క‍్రమంలోనే ఇరు జట్ల ఆటగాళ్లు తమ ఇన్నింగ్స్‌ల్లో ఒక్క సిక్సర్‌ను కూడా సాధించలేకపోయారు. అయితే భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా శుక‍్రవారం ఆటలో మొహ్మద్ షమీ దూకుడుగా ఆడే క్రమంలో మోర్నీ మోర్కెల్ వేసిన 70 ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా కొట్టాడు. ఇదే ఈ గేమ్‌కు తొలి సిక్సర్ కావడం ఇక్కడ విశేషం. ఆపై రబడా వేసిన 72 ఓవర్ మొదటి బంతిని షమీ మరో సిక్సర్ కొట్టాడు. అజింక్యా రహానే(48) హాఫ్ సెంచరీకి రెండు పరుగుల దూరంలో పెవిలియన్ చేరిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన షమీ ఎదురుదాడికి దిగాడు. సాధ్యమైనన్ని విలువైన పరుగుల‍్ని బోర్డుపై ఉంచే క్రమంలో బ్యాట్‌కు పనిచెప్పాడు. ప్రస్తుతానికి భారత జట్టు 231 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాగా, భారత జట్టు 238 పరుగుల వద్ద ఉండగా షమీ(27) ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment