
కేప్‌టౌన్: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. 65/2 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించి సఫారీలు ఆదిలోనే నాలుగు వికెట్లను కోల్పోయి చిక్కుల్లో పడ్డారు. మ్యాచ్ ప్రారంభమైన గంట వ్యవధిలో హషీమ్ ఆమ్లా(4), రబడా(5), డు ప్లెసిస్(0), డీ కాక్(8) వికెట్లను దక్షిణాఫ్రికా నష్టపోయింది. ఓవర్‌నైట్ ఆటగాళ్లు ఆమ్లా, రబడాలను షమీ పెవిలియన్‌కు పంపగా, డు ప్లెసిస్, డీకాక్‌లనును బూమ్రా అవుట్ చేశాడు. దాంతో సఫారీలు 92 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయారు. విరాట్ సేన విజృంభణతో దక్షిణాఫ్రికా ఎదురీదుతోంది.
భారీ వర్షం కారణంగా మూడో రోజు ఆట రద్దయిన సంగతి తెలిసిందే. కాగా, నాల్గో రోజు ఆటను ఆమ్లా, రబడాలు నెమ్మదిగా ఆరంభించారు. అయితే ప్రధానంగా షమీ పేస్‌ను ఎదుర్కోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డ వీరిద్దరూ అతని బౌలింగ్‌లోనే అవుటయ్యారు. తొలుత ఆమ్లా మూడో వికెట్‌గా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, ఆపై కాసేపటికి రబడా కూడా స్లిప్‌లో కోహ్లి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అటు తరువాత డు ప్లెసిస్, డీకాక్‌లు సైతం తీవ్రంగా నిరాశపరిచారు. వికెట్ కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి ఇద్దరూ అవుటయ్యారు. సఫారీలు కోల్పోయిన ఆరు వికెట్లలో హార్దిక్ పాండ్యా, షమీ, బూమ్రాలు తలో రెండు వికెట్లు సాధించారు. దక్షిణాఫ్రికా 95 పరుగుల వద్ద ఉండగా ఫిలిండర్ డకౌట్‌గా అవుటయ్యాడు. షమీ బౌలింగ్‌లో ఫిలిండర్ వికెట్లు ముందు దొరికిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment