జోహెన్నెస్‌బర్గ్: గత రెండు రోజుల క్రితం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మూడు టెస్టుల సిరీస్ ముగిసిన సంగతి తెలిసిందే. చివరిటెస్టులో టీమిండియా 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ కాకుండా తప్పించుకుంది. అయితే ఇరు జట్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక మూడు టెస్టుల సిరీస్‌లో అరుదైన రికార్డు నమోదైంది. ఈ సిరీస్‌లో భారత్-దక్షిణాఫ్రికాలు ప్రతీ ఇన్నింగ్స్‌లోనూ ఆలౌట్ కావడంతో టెస్టు క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించబడింది. మూడు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 12 సార్లు కూడా ఆలౌట్ కావడం టెస్టు చరిత్రలో ఇది మొదటిసారి మాత్రమే.
మొత్తంగా 120 వికెట్లు కుప్పకూలడంతో సరికొత్త చరిత్రకు నాంది పలికింది. మరొకవైపు విదేశీ గడ్డపై మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ ప్రత్యర్థి వికెట్లన్నీ కుప్పకూల్చడం ఇది రెండో సారి మాత్రమే. గతంలో 1986లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత్ ఆరు ఇన్నింగ్స్‌లోనూ ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. ఇదిలా ఉంచితే, భారత్ తరపున అత్యధిక టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో ధోని(27 విజయాలు) కొనసాగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment