
శరత్ కమల్ శుభారంభం
న్యూఢిల్లీ: ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి ప్లేయర్ ఆచంట శరత్ కమల్ శుభారంభం చేశాడు. థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్‌లో శరత్ 11-4, 115, 11-3, 11-1తో సయీద్ అల్ కురానీ (ఒమన్)పై నెగ్గాడు.
ఇతర మ్యాచ్‌ల్లో సనీల్ శెట్టి 11-6, 11-2, 11-7, 11-9తో ఖురేషి (పాకిస్తాన్)పై; సౌమ్యజిత్ 11-5, 11-4, 11-2, 11-2తో కుజ్‌మెంకో (తుర్క్‌మెనిస్తాన్)పై; సత్యన్ 11-6, 11-4, 11-5, 11-3తో బాలూషిపై నెగ్గారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో జపాన్ అమ్మాయి మిమా ఇటో 15-17, 11-5, 11-6, 11-6, 10-12, 11-3తో అంకితా దాస్‌పై; చెన్ మింగ్ (చైనా) 11-6, 11-7, 5-11, 15-13, 11-5తో మౌమదాస్‌పై విజయం సాధించారు.