ధావన్ బౌలింగ్పై ఐసీసీకి ఫిర్యాదు | Shikhar Dhawan has been reported for suspect bowling action | Sakshi
Sakshi News home page

ధావన్ బౌలింగ్పై ఐసీసీకి ఫిర్యాదు

Published Wed, Dec 9 2015 12:40 PM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM

ధావన్ బౌలింగ్పై ఐసీసీకి ఫిర్యాదు - Sakshi

ధావన్ బౌలింగ్పై ఐసీసీకి ఫిర్యాదు

ఢిల్లీ: భారత క్రికెటర్ శిఖర్ ధావన్ బౌలింగ్ శైలి వివాదాస్పదంగా మారింది. ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టెస్టులో ధావన్ బౌలింగ్ సందేహాస్పదంగా ఉందని మ్యాచ్ అధికారులు ఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఈ మ్యాచ్లో ధావన్ వేసిన ఆఫ్ స్పిన్ బంతులు ఐసీసీ నిబంధనలకు లోబడి ఉన్నాయా అన్న దానిపై సందేహం వ్యక్తం చేశారు.

టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్మన్ అయిన ధావన్ సాధారణంగా బౌలింగ్ చేయడం అరుదు. ఇప్పటివరకు అంతర్జాతీయ టి-20, వన్డేల్లో ఒక్క బంతి కూడా వేయలేదు. టెస్టుల్లో మాత్రం బౌలింగ్ చేశాడు. అదికూడా 19 టెస్టులాడిన ఢిల్లీ క్రికెటర్ కేవలం 9 ఓవర్లే వేశాడు. కాగా ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఇక సౌతాఫ్రికాతో నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఓ ఓవర్ను మెయిడిన్గా ముగించి 9 పరుగులిచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement