న్యూఢిల్లీ: వేల్స్ ఓపెన్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మారుు సిక్కి రెడ్డి మహిళల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్‌కే చెందిన అశ్విని పొన్నప్పతో జతకట్టిన సిక్కి రెడ్డి శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 21-16, 21-18తో మూడో సీడ్ జెన్నీ మూర్-విక్టోరియా విలియమ్స్ (ఇంగ్లండ్) ద్వయంపై విజయం సాధించింది.
మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సహచరుడు ప్రణవ్ చోప్రాతో కలిసి సిక్కి రెడ్డి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. రెండో రౌండ్‌లో సిక్కి-ప్రణవ్ జోడీ 21-16, 21-11తో మాక్స్ ఫ్లిన్-నికోలా గ్రిస్టీ (ఇంగ్లండ్) జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్ విభాగంలో సౌరభ్ వర్మ రెండో రౌండ్‌లోనే ఓటమి పాలయ్యాడు.
సెమీస్‌లో సిక్కి రెడ్డి-అశ్విని జంట
Published Sat, Dec 3 2016 12:45 AM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM
Advertisement
Advertisement