ఫైనల్లో సిక్కిరెడ్డి జోడి | sikki reddy team to final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సిక్కిరెడ్డి జోడి

Published Sat, Jun 6 2015 12:50 AM | Last Updated on Fri, Nov 9 2018 6:39 PM

ఫైనల్లో సిక్కిరెడ్డి జోడి - Sakshi

ఫైనల్లో సిక్కిరెడ్డి జోడి

శ్రీలంక ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్

 సాక్షి, హైదరాబాద్ : శ్రీలంక ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అమ్మాయిలు సిక్కి రెడ్డి-ప్రద్నా గాద్రె జోడి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ సెమీస్‌లో రెండోసీడ్ సిక్కి-ప్రద్నా 21-18, 21-9తో కైలాస్ ఆస్టర్‌మేయర్-నచ్చ సెంగ్‌చోటే (థాయ్‌లాండ్)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో అపర్ణా బాలన్-ప్రజక్తా సావంత్ జోడి పోరాడి ఓడింది. మూడోసీడ్ చాయనిత్-మెనువాంగ్ (థాయ్‌లాండ్) 21-18, 21-19తో అపర్ణా-ప్రజక్తాలపై నెగ్గారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో అరుణ్ విష్ణు-అపర్ణా బాలన్ జోడి టైటిల్ పోరుకు వెళ్లింది. సెమీస్‌లో ఈ జంట 21-19, 21-12తో ఇంద్ర మవాన్ (మలేసియా)-ప్రజక్తా సావంత్ (భారత్)లపై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement