'ఆ ఓవరే మ్యాచ్ను మలుపు తిప్పింది' | Sixteenth over was turning point for South Africa: Duminy | Sakshi
Sakshi News home page

'ఆ ఓవరే మ్యాచ్ను మలుపు తిప్పింది'

Published Sat, Oct 3 2015 3:58 PM | Last Updated on Sun, Sep 3 2017 10:23 AM

'ఆ ఓవరే మ్యాచ్ను మలుపు తిప్పింది'

'ఆ ఓవరే మ్యాచ్ను మలుపు తిప్పింది'

ధర్మశాల: భారత్తో తొలి టి-20 మ్యాచ్లో 16వ ఓవర్ మ్యాచ్ను మలుపు తిప్పిందని దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ డుమినీ అన్నాడు. ఈ ఓవర్లో 22 పరుగులు రావడంతో మ్యాచ్ తమ వైపు మొగ్గు చూపిందని డుమినీ చెప్పాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో సఫారీలు 7 వికెట్లతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఓపెనర్లు ఆమ్లా, డివిల్లీర్స్ 77 పరుగుల శుభారంభం అందించడం తమకు కీలకం కాగా, 16వ ఓవర్ టర్నింగ్ పాయింట్ వంటిదని డుమినీ వివరించాడు. చివరి 4 ఓవర్లలో బాగా ఆడామని, దీంతో విజయం సాధించగలిగామని చెప్పాడు. ఈ మ్యాచ్లో భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్ ఆడాడని ప్రశంసించాడు.

200 పరుగుల లక్ష్యంతో దిగిన సఫారీలు 15 ఓవర్లలో 134/3 స్కోరు  చేశారు. ఈ దశలో టీమిండియా పరిస్థితి మెరుగ్గానే ఉంది. అయితే అక్షర్ పటేల్ వేసిన ఆ మరుసటి ఓవర్లో డుమినీ వరుసగా మూడు సిక్సర్లు బాదడంతో పరిస్థితి మారిపోయింది. డుమినీ (68 నాటౌట్), బెహర్డియెన్ (32 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్లో భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ చేసినా ఓటమి తప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement