అక్టోబరు 2 నుంచి దక్షిణాఫ్రికాతో సిరీస్
న్యూఢిల్లీ: త్వరలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు భారత పర్యటనకు రాబోతోంది. 72 రోజుల పాటు దక్షిణాఫ్రికా టీమ్ భారత్లో పర్యటించనుంది. టీమిండియా, సఫారీల సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ నుంచి భారత్, దక్షిణాఫ్రికాలు మూడు టి-20లు, ఐదు వన్డేలు, నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లు ఆడనున్నాయి.
అక్టోబర్ 2న ఇరు జట్ల మధ్య జరిగే తొలి టి-20 మ్యాచ్తో దక్షిణాఫ్రికా పర్యటన ఆరంభమవుతుంది. సోమవారం బీసీసీఐ, క్రికెట్ సౌతాఫ్రికా సంయుక్తంగా షెడ్యూల్ను విడుదల చేశాయి. పటిష్టమైన టీమిండియా, దక్షిణాఫ్రికాల మధ్య జరిగే పోరు అభిమానులకు వినోదాన్ని అందించనుంది. కాగా హైదరాబాద్, విశాఖపట్నంలో ఒక్క మ్యాచ్ కూడా జరగకపోవడం తెలుగు క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగించే విషయం.
సిరీస్ షెడ్యూల్ ఇదే:
టి-20 సిరీస్:
మ్యాచ్ | వేదిక | తేదీ |
తొలి-20 | ధర్మశాల | అక్టోబరు 2 |
రెండో టి-20 | కటక్ | అక్టోబరు 5 |
మూడో టి-20 | కోల్కతా | అక్టోబరు 8 |
వన్డే సిరీస్
తొలి వన్డే | కాన్పూర్ | అక్టోబరు 11 |
రెండో వన్డే | ఇండోర్ | అక్టోబరు 14 |
మూడో వన్డే | రాజ్కోట్ | అక్టోబరు 18 |
నాలుగో వన్డే | చెన్నై | అక్టోబరు 22 |
ఐదో వన్డే | ముంబై | అక్టోబరు 25 |
టెస్టు సిరీస్
తొలి టెస్టు | మొహాలీ | నవంబర్ 5-9 |
రెండో టెస్టు | బెంగళూరు | నవంబర్ 14-18 |
మూడో టెస్టు | నాగ్పూర్ | నవంబర్ 25-29 |
నాలుగో టెస్టు | ఢిల్లీ | డిసెంబర్ 3-7 |