మైదానంలో స్లెడ్జింగ్.. బయట డ్యాన్సింగ్ | Sledging on the ground and outside dancing | Sakshi
Sakshi News home page

మైదానంలో స్లెడ్జింగ్.. బయట డ్యాన్సింగ్

Published Sun, May 17 2015 1:56 PM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM

మైదానంలో స్లెడ్జింగ్.. బయట డ్యాన్సింగ్

మైదానంలో స్లెడ్జింగ్.. బయట డ్యాన్సింగ్

 క్రికెట్ మైదానంలో ప్రత్యర్థులపై మాటల యుద్ధానికి దిగడంలో వెస్టిండీస్ స్టార్ డ్వేన్ బ్రేవో, భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఇద్దరూ ఇద్దరే. ఇక ఐపీఎల్‌లో ఈ ఇద్దరూ ప్రత్యర్థులుగా తలపడినప్పుడు కూడా ఇది సహజం. ఇటీవల చెన్నై, బెంగళూరుల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఆ మ్యాచ్ ముగిసిన వెంటనే తెల్లారి ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. డ్వేన్ బ్రేవో ‘చలోచలో’ అనే పాటను తయారు చేస్తున్నాడు.

బ్రేవో పాప్ సింగర్‌గా మారాలనే ఉద్దేశంతో ఈ పాటతో ఆల్బమ్ తయారు చేస్తున్నాడు. ఇందులో భాగంగా తయారు చేస్తున్న వీడియోలో బ్రేవో, కోహ్లి కలిసి డ్యాన్స్ చేశారు. మైదానంలో స్లెడ్జింగ్ చేసుకుని 24 గంటలు కూడా గడవకముందే సరదాగా కలిసి ఎంజాయ్ చేశారు. అన్నట్లు ఈ వీడియోలో ధోని, రవీంద్ర జడేజా, పొలార్డ్, స్యామీ, మెకల్లమ్, హస్సీ, రస్సెల్‌ల డ్యాన్స్ కూడా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement