
ఈనెల 10న భారత జట్టు కోచ్ ఇంటర్వ్యూ: గంగూలీ
అనిల్ కుంబ్లే రాజీనామాతో ఖాళీ అయిన భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవికి ముంబైలో ఈనెల 10న ఇంటర్వ్యూ...
అనిల్ కుంబ్లే రాజీనామాతో ఖాళీ అయిన భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవికి ముంబైలో ఈనెల 10న ఇంటర్వ్యూ నిర్వహిస్తామని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు.
ఈ నెల 3,4 తేదీల్లో లండన్‌లో జరిగే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ వరల్డ్ క్రికెట్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు గంగూలీ శనివారం బయలుదేరి వెళ్లారు. రవిశాస్త్రి, సెహ్వాగ్, టామ్ మూడీ, లాల్‌చంద్ రాజ్‌పుత్, రిచర్డ్ పైబస్, దొడ్డ గణేశ్ కోచ్ పదవి రేసులో ఉన్నారు.