దక్షిణాఫ్రికా 242 ఆలౌట్
సఫారీలని దెబ్బతీసిన స్టార్క్
రాణించిన వార్నర్, ఆసీస్ 105/0
పెర్త్: ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దక్షిణాఫ్రికాపై పైచేరుు సాధించింది. తొలి టెస్టు తొలి రోజు ఆటలో మిచెల్ స్టార్క్ (4/71) బంతితో చెలరేగితే... వార్నర్ (62 బంతుల్లో 73 బ్యాటింగ్; 13 ఫోర్లు, 1 సిక్స్) బ్యాటింగ్‌లో మెరిశాడు. వాకా మైదానంలో గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా 63.4 ఓవర్లలో 242 పరుగుల వద్ద ఆలౌటైంది. డికాక్ (101 బంతుల్లో 84; 11 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, బవుమా (86 బంతుల్లో 51; 7 ఫోర్లు) రాణించాడు. స్టార్క్‌తో పాటు హజెల్‌వుడ్ (3/70), లియోన్ (2/38) దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించారు.
తర్వాత ఆసీస్ ఇన్నింగ్‌సను మార్ష్ (29 బ్యాటింగ్)తో కలిసి వార్నర్ ధాటిగా ప్రారంభించాడు. వన్డేను తలపించే వేగంతో వార్నర్ 39 బంతుల్లోనే (10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తిచేశాడు. దీంతో ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా వికెట్ కోల్పోకుండా 105 పరుగులు చేసింది.