దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్ | South Africa won by an innings and 92 runs | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్

Published Sat, Oct 26 2013 6:31 PM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM

దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్

దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్

దుబాయ్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలయింది. ఇన్నింగ్స్ 92 పరుగులతో తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమమయింది.

సఫారీ జట్టు నిర్దేశించిన 418 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ తన రెండో ఇన్నింగ్స్లో 326 పరుగులకు ఆలౌటయింది. పాక్ ఆటగాళ్లు విఫలమవడంతో మరో రోజు మిగులుండగానే మ్యాచ్ ముగిసింది. షఫీక్(130) సెంచరీ, మిస్బా(88) జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేసినా ఫలించలేదు.

సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 163.1 ఓవర్లలో 517 పరుగులకు ఆలౌటైంది. డబుల్ సెంచరీ(234) చేసిన దక్షిణాఫ్రికా కెప్టెన్ స్మిత్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. డీవిలియర్స్ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' దక్కించుకున్నాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement