బెంగళూరు: ఐపీఎల్ తరహాలో ప్రారంభంకానున్న ప్రొ కబడ్డీ లీగ్‌కు కేంద్ర క్రీడాశాఖ లాంఛనంగా ఆమోద ముద్ర వేసింది. ఈనెల 26 నుంచి ముంబైలో జరగనున్న ఈ లీగ్‌లో ఎనిమిది ఫ్రాంచైజీల జట్లు బరిలోకి దిగనున్నాయి. ‘వారసత్వ క్రీడగా వస్తున్న కబడ్డీపై దృష్టిపెట్టడం చాలా సంతోషంగా ఉంది.
ఈ క్రీడకు మార్గదర్శకత్వం చేయనున్న మషాల్ స్పోర్ట్స్ కృషి ప్రశంసనీయం. క్రీడాకారుల్లో సామర్థ్యం, బలం, నైపుణ్యం, వ్యూహం, సమష్టి కృషిని పెంపొందించేందుకు ఈ ఆట దోహదం చేస్తుంది. కాబట్టి భారత యువతను ఈ క్రీడ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాం’ అని క్రీడా శాఖ సెక్రటరీ అజిత్ ఎమ్. శరణ్... ప్రొ కబడ్డీ లీగ్‌ను రూపొందించిన మషాల్ స్పోర్ట్స్ మేనేజింగ్ డెరైక్టర్ చారు శర్మకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ప్రొ కబడ్డీ లీగ్‌కు క్రీడా శాఖ ఆమోదం!
Published Sat, Jul 5 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM
Advertisement
Advertisement