సన్‌రైజర్స్ జట్టు
హైదరాబాద్ : ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొంటున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ గత ఐదు సీజన్లలో ఆ జట్టు దిగ్గజ ఓపెనర్లు శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్‌లు లేకుండా తొలిసారి బరిలోకి దిగింది. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సీజన్ ఐపీఎల్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఈ దిగ్గజ ఆటగాడి గైర్హాజరుతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ విభాగంలో సగం బలం కోల్పోయింది. దీంతో ఈ సీజన్ తొలి మూడు మ్యాచుల్లో బ్యాటింగ్ బాధ్యతలను ఎత్తుకున్నధావన్ అనూహ్యంగా పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో గాయపడ్డాడు.
దీంతో సన్‌రైజర్స్ ఆ మ్యాచ్‌లో మూల్యం చెల్లించుకొని తొలి ఓటమిని చవిచూసింది. ఇక ధావన్ ప్రస్తుత చెన్నై మ్యాచ్‌కు కూడా కోలుకోకపోవడంతో అతని స్థానంలో యువ ఆటగాడు రికీభుయ్ అరంగేట్రం చేశాడు. 2013 నుంచి శిఖర్ ధావన్, వార్నర్‌ల్లో ఏ ఒక్క ఆటగాడు లేకుండా సన్‌రైజర్స్ బరిలోకి దిగలేదు. ఈ దిగ్గజ ఆటగాళ్లు లేకుండా సన్‌రైజర్స్ బరిలోకి దిగడానికి తాజా చెన్నై మ్యాచ్ వేదికైంది.
Comments
Please login to add a commentAdd a comment