శిఖర్ ధావన్
సాక్షి, హైదరాబాద్ : త్వరలోనే మైదానంలో అడుగుపెడుతానని టీమిండియా క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ స్పష్టం చేశాడు. కింగ్స్‌పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ స్టార్ ఓపెనర్ గాయంతో రిటైర్డ్ ఔట్‌గా మైదానం వీడిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌కు సైతం ధావన్ దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ధావన్ గాయంపై సన్ అభిమానుల్లో ఆందోళన నేలకొంది. ఈ క్రమంలో ధావన్ తన గాయంపై క్లారిటీ ఇస్తూ.. తన మోచేతి ఎముక విరగలేదని.. త్వరలోనే మైదానంలో అడుగెడుతానని.. ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో క్యాప్షన్‌గా ‘ నా గాయం త్వరగా నయం కావాలని.. మెసేజ్‌లు పంపించిన అభిమానులకు, నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. నా గాయం మానుతోంది. త్వరలోనే మైదానంలోకి వస్తా. అప్పటి వరకు ఐపీఎల్‌ను ఆస్వాదించండి.’ అని ట్వీట్ చేశాడు. ఇక ధావన్ గాయం అంత పెద్దది కాదని, బంతి నేరుగా మోచేతికి తగలడంతో కొంచెం వాపు వచ్చిందని సన్ మెంటర్ లక్ష్మణ్ మీడియాకు తెలిపాడు.
ఇప్పటికే డాషింగ్ ఓపెనర్, ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ టోర్నీకి దూరమవ్వడంతో సన్‌రైజర్స్ సగం బలం కోల్పోయింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ బాధ్యతలను నెత్తిన ఎత్తుకున్న ధావన్..దూరం కావడం రైజర్స్ బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. కోల్‌కతాతో(7) మినహా.. రాజస్తాన్‌పై 77, ముంబైపై 45 పరుగులతో ధావన్ సన్‌రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇక పంజాబ్ మ్యాచ్‌లో రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగడంతో సన్‌కు ఈ సీజన్‌లో తొలి ఓటమి ఎదురైంది. ఇక చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో అదిరే ఆరంభం లేక.. విలియమ్సన్ (84), యూసఫ్ పఠాన్(45) పోరాడిన ఫలితం దక్కలేదు.
Thanks to all my fans and well-wishers for the wonderful messages you have been sending and wishing for my recovery. I’m on my path to recovery and will be back in action soon. Till then enjoy the #iplt20 #willbebackinactionsoon pic.twitter.com/NMAuoPCRkj
— Shikhar Dhawan (@SDhawan25) 22 April 2018
Comments
Please login to add a commentAdd a comment