హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్–11లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఉప్పల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ధోని సేనను బ్యాటింగ్ ఆహ్వానించాడు. ఇక ఈ మ్యాచ్‌కు హైదరాబాద్ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ దూరమయ్యాడు. గత మ్యాచ్‌లో గాయపడ్డ ధావన్ కోలుకోలేదని, అతని స్థానంలో రికీ బుయ్ అరంగేట్రం చేస్తున్నట్లు మిలియమ్సన్ తెలిపాడు. క్రిస్ జోర్డాన్ స్థానంలో బిల్లీ స్టేన్‌లేక్ తిరిగొచ్చాడని.. చెన్నైతో కఠిన మ్యాచ్ అని విలియమ్సన్ పేర్కొన్నాడు. ఇక చెన్నై జట్టులో తాహిర్ స్థానంలో ఫాఫ్ డుప్లెసిస్ వచ్చాడు. పటిష్ట బౌలింగ్ వనరులు కలిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. బెస్ట్ బ్యాటింగ్ లైనప్ కలిగిన చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుండటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
బెస్ట్ బౌలింగ్ Vs బెస్ట్ బ్యాటింగ్
జన్ ఆరంభంలో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరిన హైదరాబాద్ గత మ్యాచ్‌లో గేల్ సెంచరీతో విరుచుకుపడటంతో తొలి ఓటమిని చవిచూసింది. దీంతో తిరిగి గాడిన పడి చెన్నైపై ఆధిపత్యం చూపాలని తహతహలాడుతోంది. భువనేశ్వర్, రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్, స్టాన్‌లేక్, షకీబుల్ హసన్‌లతో రైజర్స్ బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తున్నా... బ్యాటింగ్‌లో ముందుండి నడిపించే వారు కరువవడం ఇబ్బందిగా మారింది. మరోవైపు గత మ్యాచ్‌లో భారీ విజయంతో జోరు మీద ఉన్న చెన్నై... అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. రాజస్తాన్ రాయల్స్‌పై మెరుపు శతకంతో చెలరేగిన వాట్సన్‌తో పాటు రైనా, ధోని, రాయుడు, బిల్లింగ్స్, బ్రేవో, జడేజాలతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది.
తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్ : కేన్ విలియమ్సన్(కెప్టెన్), రికీ భుయ్, వృద్ధిమాన్ సాహా, మనీష్ పాండే, యూసఫ్ పఠాన్, రషీద్ ఖాన్, షకీబుల్ హసన్, దీపక్ హుడా, బిల్లీ స్టాన్‌లేక్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్
చెన్నై: ఎంఎస్ ధోని(కెప్టెన్), షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, సామ్ బిల్లింగ్స్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో, దీపక్ చాహర్, కరణ్ శర్మ, శార్దూల్ ఠాకూర్, ఫాఫ్ డుప్లెసిస్
Comments
Please login to add a commentAdd a comment