
న్యూఢిల్లీ: నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్ స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు... ఇంగ్లండ్ డాషింగ్ బ్యాట్స్‌మన్ అలెక్స్ హేల్స్‌ను ఎంపిక చేసుకుంది. ఇంగ్లండ్ తరఫున టి20ల్లో ఏకైక సెంచరీ చేసిన ఈ ఓపెనర్‌ను కనీస ధర కోటి రూపాయలకు తీసుకుంది. 29 ఏళ్ల హేల్స్ 2015 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు.
దాంతోపాటు బిగ్‌బాష్ లీగ్ (ఆస్ట్రేలియా), పాకిస్తాన్ సూపర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లలో కూడా బరిలోకి దిగాడు. కెరీర్‌లో 52 టి20 మ్యాచ్‌లు ఆడిన హేల్స్ 136.32 స్ట్రయిక్ రేట్‌తో 1,456 పరుగులు సాధించాడు. ‘సన్‌రైజర్స్ హైదరాబాద్ వార్నర్ స్థానంలో అలెక్స్ హేల్స్‌ను ఎంచుకుంది’ అని ఐపీఎల్ పాలక మండలి ఓ ప్రకటనలో తెలిపింది.