కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ చండికా హతురుసింఘాపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు హతురుసింఘా సేవలు అందించడం లేదని బోర్డు పేర్కొంది. అతని స్థానంలో తాత్కాలిక కోచ్‌గా రుమేష్ రత్ననాయకేయను నియమించింది. వరల్డ్‌కప్‌లో లంక పేలవ ప్రదర్శన కారణంగానే హతురసింఘాను తప్పించినట్లు తెలుస్తోంది. కాగా, హతురుసింఘాను తప్పించడానికి గల కారణాలను క్రికెట్ బోర్డు చైర్మన్ షిమ్మి సిల్వా వెల్లడించలేదు. హతురసింఘాకు భారీ మొత్తంలో నెలవారీ జీతం చెల్లిస్తున్న క్రమంలో అతని సేవలు అవసరం లేదని భావించే శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
హతురసింఘాకు నెలవారీ జీతం 40 వేల డాలర్లు కాగా, ఒక విదేశీ కోచ్ అందులో సగానికి వస్తాడని సదరు బోర్డు భావిస్తోంది. శ్రీలంక క్రికెట్ ప్రధాన కోచ్‌ను ఎంపిక చేయడానికి ఇప్పటికే ముగ్గురు పేర్లను పరిశీలించినట్లు ఆ దేశ క్రీడా మంత్రి హరిన్ ఫెర్నాండో పేర్కొన్నారు. 2017లో హతురుసింఘాను ప్రధాన కోచ్‌గా నియమించారు. శ్రీలంక జట్టు కష్టకాలంలో ఉన్న సమయంలో హతురసింఘా కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే హతురుసింఘా పర్యవేక్షణలో కూడా లంక జట్టు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదు. వరల్డ్‌కప్‌లో అయితే లంక పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆ జట్టు ఆరోస్థానంలో నిలిచి లంక బోర్డు పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేసింది. ఈ క్రమంలోనే లంక జట్టులో ప్రక్షాళన చేపట్టడానికి శ్రీకారం చుట్టారు.
Comments
Please login to add a commentAdd a comment